AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: తనూజ Vs ఇమ్మాన్యుయేల్.. కళ్యాణ్ దెబ్బకు విడిపోయిన స్నేహబంధం..

బిగ్‏బాస్ సీజన్ 9.. ఆరో వారం ఊహించని మలుపు తిరిగింది. ఇన్నాళ్లు ప్రేక్షకులకు ఫేవరేట్ జోడీగా మారిన ఇమ్మూ, తనూజ మధ్య చిచ్చు రేగింది. మొదటి నుంచి స్నేహంగా ఉన్న వీరిద్దరు ఇప్పుడు శత్రువులుగా మారారు. మరోవైపు తనూజకు క్లోజ్ గా ఉన్న కళ్యాణ్ సైతం నామినేషన్స్ తర్వాత ఆమె గురించి మరొకరి దగ్గర ముచ్చట పెట్టాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

Bigg Boss 9 Telugu: తనూజ Vs ఇమ్మాన్యుయేల్.. కళ్యాణ్ దెబ్బకు విడిపోయిన స్నేహబంధం..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Oct 22, 2025 | 10:31 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఆరోవారం నామినేషన్స్ రంజుగా సాగింది. ముఖ్యంగా అడియన్స్ ఫేవరేట్ జంట ఇమ్మాన్యుయేల్, తనూజ మధ్య రగడ మొదలైంది. నామినేషన్స్ తర్వాత కళ్యాణ్ తో ముచ్చటించాడు ఇమ్మూ. నాకు ఇంట్లో వాళ్లతో ఎలాంటి గొడవలు లేవు.. కేవలం తనూజ మీద ఒక్క పాయింట్ ఉంది.. నేను ఏం సేఫ్ గేమ్ ఆడట్లేదు.. సేఫ్ గేమ్ ఆడేవాడ్నే అయితే తనూజను నామినేట్ చేస్తానని నీకు ఈరోజు చెప్పను అని ఇమ్మూ అన్నాడు. నేను కూడా అదే చెప్పాను కదన్నా.. నీకు చెప్పి ఎందుకు వ్యతిరేకంగా చేస్తాననుకున్నావ్ అని కళ్యాణ్ అన్నాడు. తనూజ నాకు క్లోజ్ ఫ్రెండ్. నేను నామినేట్ చేస్తే ఎంతగా బాధపడుతుందో నాకు తెలుసు.. కానీ నేను తర్వాత సర్దిచెప్పుకుంటాను..నువ్వు ఆడేది సేఫ్ గేమ్ లా కనిపిస్తుంది చూసుకో అని డీమాన్ తో అన్నాడు ఇమ్మూ. ఆ తర్వాత డిమాన్ వెళ్లిపోగానే ఇమ్మూ, కళ్యాణ్ మాట్లాడుకున్నారు. ఈవారం నువ్వు గమనించు తను జెన్యూన్ గా ఉంటుందో లేదో.. అని తనూజ గురించి అన్నాడు ఇమ్మూ. అసలు నేను పట్టించుకోవడం మానేశానని కళ్యాణ్ అన్నాడు.

మరోవైపు దివ్యతో వాష్ రూమ్ దగ్గర మాట్లాడింది తనూజ. కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని చెప్పి వాయిస్ రెయిజ్ చేసి మాట్లాడటానికి అంతలా ఏముంది నాకు అర్థం కాలేదని తనూజ చెప్పింది. అప్పుడే ఇమ్మూ వచ్చి నిల్చోవడంతో దివ్య సైగ చేసింది. దీంతో తనూజ సీరియస్ అయ్యింది. తనూజను నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని కళ్యాణ్ వచ్చి చెప్పాడు అంటూ ఇమ్మూ మాట్లాడుతుంటే.. తనూజ మరోసారి సీరియస్ అయ్యింది. దీంతో నా నామినేషన్ పాయింట్ నీ మీదే ఉంది. నాకు నువ్వు నామినేట్ అవ్వాలని ఉంది అంటూ డైరెక్టుగా చెప్పాడు ఇమ్మూ. నాకు అనిపిస్తుంది నీది సేఫ్ గేమ్ అని తనూజ అనడంతో.. మరీ నన్ను నామినేట్ చేయ్ అన్నాడు ఇమ్మూ. ఇక ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో గో హెడ్. ఐ నెవర్ కేర్.. అంటూ తనూజ అనేసరికి.. నిమిషాల్లో మారిపోతే సేఫ్ గేమ్ అని అనుకుంటారు.. ఇలాంటి వ్యక్తినా నేను సపోర్ట్ చేసుకుని వచ్చింది అని నాకు బాదేసింది.. ఇలాంటి వ్యక్తి కోసమా నేను నిలబడింది అని బాధేసింది అని అన్నాడు ఇమ్మూ.

నీకు మొత్తం అన్ని గేమ్స్ లోనూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాగ్ సార్ అడగ్గానే ఇతను నా గురించి అసలు స్టాండే తీసుకోడని అన్నప్పుడు నాకు బాధ అనిపించదా.. ఇలాంటి పర్సన్ గురించి ఎందుకు నిలబడాలని అనిపిస్తుంది నాకు కూడా.. నీకు అన్ని గేమ్స్ లో హెల్ప్ చేశాను అని అన్నాడు ఇమ్మూ. నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు..అంటూ తనూజ వాదించింది. తనూజకు అన్ని గేమ్స్ లో హెల్ప్ చేశానంటూ మొత్తం బయటపెట్టాడు ఇమ్మూ. ఇక తర్వాత మాధురి వెళ్లి నువ్వు ఎందుకు తనూజను నామినేట్ చేయాలనుకున్నావ్ అని కళ్యాణ్ ను అడగ్గా.. చాలా రీజన్స్ ఉన్నాయని అన్నాడు. నెక్ట్ వీక్ అయిన తనూజను నామినేట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత రమ్య రావడంతోనే తనూజ గురించి పాయింట్ పెట్టుకుని వచ్చిందని గౌరవ్ తో డిస్కషన్ పెట్టింది ఆయేషా. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానని తనూజ గురించి రమ్య చెప్పిందని.. అలా ఎందుకు అంటుందో తనకు అర్థం కాలేదని చెప్పింది ఆయేషా.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..