Bombay Movie: ‘బొంబాయి’ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా.. అరవింద్ స్వామి కంటే ముందు అనుకున్న హీరో ఎవరంటే..
విరహ వేదనలో ప్రేయసి కోసం ప్రేమ వానలో తడిసి ముద్దవుతూ 'ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు.. కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు..' అంటూ హీరో పాడే పాట ఇప్పటికీ హృదయాలను తాకుతుంది. కళాత్మక విలువలతోపాటు.. కమర్షియల్ సక్సెస్ అందుకుందీ మూవీ. అయితే ఈ సినిమాకు అరవింద్ స్వామి ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో బొంబాయి ఒకటి. 1995లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. బొంబాయి మత కలహాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమూవీలోని సాంగ్స్ ఇప్పటికీ శ్రోతల మనసులను హత్తుకుంటున్నాయి. ఈ సినిమాలో అరవింద్ స్వామి నటనను ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. విరహ వేదనలో ప్రేయసి కోసం ప్రేమ వానలో తడిసి ముద్దవుతూ ‘ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు.. కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు..‘ అంటూ హీరో పాడే పాట ఇప్పటికీ హృదయాలను తాకుతుంది. కళాత్మక విలువలతోపాటు.. కమర్షియల్ సక్సెస్ అందుకుందీ మూవీ. అయితే ఈ సినిమాకు అరవింద్ స్వామి ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో తెలుసుకుందామా.
బొంబాయి సినిమాను మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరో కాదు.. చియాన్ విక్రమ్. తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విక్రమ్.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ ఈ వియాన్ని బయటపెట్టారు. బొంబాయి సినిమాలో హీరో పాత్రకు ముందుగా విక్రమ్ ను అనుకున్నారట మణిరత్నం. ఇందుకు ఆయనతో ఫోటో షూట్ జరిగిందట. ఇక అదే రోజు సాయంత్రం మనీషా కోయిరాలాతోనూ షూట్ జరిగిందట. అయితే ఈ సినిమా కోసం విక్రమ్ ను గడ్డం తీసేయాల్సి ఉంటుందని సూచించారట మణిరత్నం.
కానీ విక్రమ్ అప్పటికే ఓ సినిమా చేస్తుండడం.. అందులో హీరో పాత్రకు గడ్డం తప్పనిసరి కావడంతో బొంబాయి సినిమా నుంచి అయిష్టంగానే తప్పుకున్నారట విక్రమ్. అయితే ఆ సినిమా మిస్ కావడంపై ఇప్పటికీ బాధపడుతుంటారట విక్రమ్. మణిరత్నం సినిమాలో నటించాలనేది ప్రతి నటుడి కల. అలాంటి సమయంలో భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే బొంబాయి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ మూవీతో అరవింద్ స్వామి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.




మణిరత్నం సినిమాలో నటించేందుకు ప్రతి క్షణం ఎదురుచూస్తుంటానని.. ఆయన చిత్రాల్లో భాగమయ్యేందుకు అదృష్టమని అన్నారు విక్రమ్. బొంబాయి సినిమా రిలీజ్ అయిన సమయంలో విక్రమ్ అప్ కమింగ్ హీరో. అంతగా గుర్తింపు లేని స్టార్. ఒకవేళ ఈ సినిమా విక్రమ్ చేసి ఉంటే మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.