Jailer Movie : జైలర్ కోసం హీరో బాలకృష్ణ అనుకున్నా.. కానీ.. డైరెక్టర్ నెల్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
చాలా కాలం తర్వాత రజినీ స్టైల్, డైలాగ్ డెలివరీ మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. తొలి రోజే రూ.49 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది జైలర్ చిత్రం. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇక సీనియర్ నటుడు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. అయితే వీరితోపాటు

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమాల్లో జైలర్ ఒకటి. దాదాపు రెండేళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాతో వెండితెరపై కనిపించారు. బీస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత రజినీ స్టైల్, డైలాగ్ డెలివరీ మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. తొలి రోజే రూ.49 కోట్లు వసూలు చేసి రికార్డ్స్ బ్రేక్ చేసింది జైలర్ చిత్రం. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇక సీనియర్ నటుడు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. అయితే వీరితోపాటు నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించాల్సి ఉందట. కానీ అనుకోకుండా కథ మారిపోయిందన్నారు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ సక్సెస్ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ కీలకపాత్రలు పోషించారు. మరీ తెలుగు నుంచి ఎవరూ నటించలేదు ఎందుకు అని ప్రశ్నించగా.. ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణను తీసుకోవాలనుకున్నా కుదరలేదని అన్నారు. “తెరపై రజినీకాంత్ సర్ ఒక్కరు కనిపిస్తేనే జోష్ వస్తుంది. అందులో మల్టీస్టారర్ ప్లాన్ చేయలేదు. స్పెషల్ అట్రాక్షన్ కోసం మిగతా ఇండస్ట్రీలకు చెందిన నటులను ఎంపిక చేసాను. జైలర్ మల్టీస్టారర్ అనే ఊహాగానాలు వచ్చాయి. ఇందులో ఓ పోలీస్ పాత్ర కోసం తెలుగు హీరో బాలకృష్ణ అనుకున్నా.. కానీ కథానుగుణంగా ఆ క్యారెక్టర్ ను సరిగ్గా డిజైన్ చేయలేకపోయాను. అందుకే ఆయనను తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు. అందుకే ఆయనను సంప్రదించలేదు. ఒకవేళ ఆయన ఓకే చేసేవారేమో తెలియదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేస్తానేమో” అంటూ చెప్పుకొచ్చారు. కానీ రజినీతో బాలయ్య ఉంటే సినిమా మరో రెంజ్ లో ఉండేది అంటున్నారు ఫ్యాన్స్.
యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే మర్నా మీనన్, వసంత్ రవి, యోగి బాబు, నాగ బాబు, కిషోర్ కూడా స్టార్-స్టడెడ్ తారాగణంలో భాగమయ్యారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ఈ నిర్మించగా.. ఇప్పటివరకు రూ.100 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది.
Superstar – Lalettan – Shivanna⚡💥🔥
Have you witnessed this super trio in theatres? #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @mirnaaofficial… pic.twitter.com/w331FExOmS
— Sun Pictures (@sunpictures) August 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
