AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: లీప్ ఇయర్‏లో పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో.. ఫిబ్రవరి 29న బర్త్ డే..

ప్రతి ఏడాది కాకుండా నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈరోజు ఫిబ్రవరి 29. ఈరోజున బర్త్ డే జరుపుకునే వాళ్లకు సోషల్ మీడియాలో ఫన్నీగా విషెస్ చెబుతున్నారు నెటిజన్స్. కానీ మీకు తెలుసా ?.. ఈరోజు ఓ టాలీవుడ్ హీరో బర్త్ డే ఉంది. లీప్ ఇయర్‏లో పుట్టిన ఏకైక తెలుగు హీరో. ఈ సందర్భంగా అతడికి నెట్టింట ఫ్యాన్స్, ఫ్రెండ్స్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ?..

Tollywood: లీప్ ఇయర్‏లో పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో.. ఫిబ్రవరి 29న బర్త్ డే..
Actor
Rajitha Chanti
|

Updated on: Feb 29, 2024 | 1:55 PM

Share

ప్రతి ఒక్కరి జీవితంలో ఏడాదికి వచ్చే పుట్టినరోజు వేడుకలు చాలా స్పెషల్. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా..సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ లీప్ ఇయర్.. ఫిబ్రవరి 29న పుట్టినరోజు జరుపుకునే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు నాలుగేళ్లకు ఒకసారి బర్త్ డే వస్తుంది. అంటే ప్రతి ఏడాది కాకుండా నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఫిబ్రవరి 29న పుట్టినరోజు వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈరోజు ఫిబ్రవరి 29. ఈరోజున బర్త్ డే జరుపుకునే వాళ్లకు సోషల్ మీడియాలో ఫన్నీగా విషెస్ చెబుతున్నారు నెటిజన్స్. కానీ మీకు తెలుసా ?.. ఈరోజు ఓ టాలీవుడ్ హీరో బర్త్ డే ఉంది. లీప్ ఇయర్‏లో పుట్టిన ఏకైక తెలుగు హీరో. ఈ సందర్భంగా అతడికి నెట్టింట ఫ్యాన్స్, ఫ్రెండ్స్ స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా ?.. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఈరోజు అతడి బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్.

శ్రీవిష్ణు.. హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత చూస్తు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. విశాఖపట్నంలో జన్మించిన శ్రీవిష్ణు 2009లో బాణం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ, భళా తందనాన చిత్రాల్లో నటించి మెప్పించాడు. చివరగా సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్నాడు.

ఈరోజు శ్రీవిష్ణు 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పుట్టినరోజు కావడంతో తన బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో లీప్ ఇయర్ లో పుట్టిన ఏకైక హీరో శ్రీవిష్ణు. ఇప్పుడు ఆయన నటించిన ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న విడుదల కానుంది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. స్వాగ్, ఏమండో బాగున్నారా సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Sree Vishnu (@sreevishnu29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.