AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak : ఆ హీరో 18 ఏళ్లకే స్టార్ డమ్ చూశాడు.. ఫ్యాన్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నాడు.. డైరెక్టర్ వివి వినాయక్..

టాలీవుడ్ లో తిరుగులేని మాస్ , కమర్షియల్ దర్శకుల్లో వి. వి. వినాయక్ ఒకరు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై-వోల్టేజ్ ఎమోషన్స్, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ ఆయన భారీ విజయాలను అందుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చెన్నెకేశవరెడ్డి బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించింది.

VV Vinayak : ఆ హీరో 18 ఏళ్లకే స్టార్ డమ్ చూశాడు.. ఫ్యాన్స్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నాడు.. డైరెక్టర్ వివి వినాయక్..
Vv Vinayak
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2026 | 10:43 PM

Share

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటైన ఆది గురించి, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు అది ఎంత కీలకమైందో వివరించారు. ఆది సినిమా విడుదలైన తొలి షోకే ఎన్టీఆర్ స్టార్‌డమ్ స్పష్టంగా కనిపించిందని వినాయక్ తెలిపారు. నందమూరి తారక రామారావు అంశ తారక్ కే వచ్చిందని, సేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్, డైలాగ్స్ ఇతనిలో చూస్తున్నారని ఆడియన్స్ అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు. ఆది విడుదల రోజున జరిగిన ఒక సంఘటనను వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ వైజాగ్‌ నుంచి శ్రీకాకుళం వైపు ట్రైన్‌లో షూటింగ్‌కు వెళ్తుండగా, అభిమానులు ట్రైన్‌ను కదలనివ్వకుండా ప్రతి స్టేషన్‌లోనూ ఆపేశారని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు ఫోన్ చేసి, “అన్నా అసలు ఏంటన్నా ఇది?” అని ఆశ్చర్యపోయారని, తన కళ్ళలో నీళ్లు నిండినంత భావోద్వేగానికి లోనయ్యారని వినాయక్ పేర్కొన్నారు. చిన్న పిల్లోడు, 18-19 ఏళ్ల వయస్సులో అంత పెద్ద స్టార్‌డమ్ చూసి తను ఎంతో ప్రభావితం అయ్యాడని ఆయన అన్నారు. ఆది చిత్రాన్ని కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, అది భారీ వసూళ్లు సాధించిందని వినాయక్ తెలిపారు.

ఎన్టీఆర్ కథ విషయంలో, సినిమా విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యడని అన్నారు. అలాగే ఎవరీ మాట వినడని అన్నారు. దర్శకుడిగా నటీనటులతో తన అనుబంధం గురించి వినాయక్ పంచుకున్నారు. తాను ఎప్పుడూ చొచ్చుకువెళ్లే మనస్తత్వం కాదని, హీరోల స్పేస్‌ను తాను గౌరవిస్తానని అన్నారు. వారు ఫోన్ చేస్తేనే వెళ్తానని, తనంతట తానుగా ఎప్పుడూ వెళ్ళనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభాస్‌తో తనకున్న బంధాన్ని ఉదాహరణగా చెప్పారు. ప్రభాస్ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, ఆయనకు జీరో యాటిట్యూడ్ ఉంటుందని ప్రశంసించారు. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటికీ, తన స్నేహితుల విషయంలో ఎప్పుడూ చాలా ప్రేమగా, చాలా ఇదిగా ఉంటాడని అన్నారు. తాను ఎప్పుడూ ప్రభాస్‌ను డిస్టర్బ్ చేయనని, రెండు, మూడు నెలలకు ఒకసారి ప్రభాస్ స్వయంగా “డార్లింగ్, ఎక్కడున్నారు?” అని ఫోన్ చేసి కలుస్తాడని వినాయక్ తెలిపారు.

తన పుట్టినరోజు వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ వంటి ప్రముఖులు హాజరయ్యారని, అల్లు అర్జున్ షూటింగ్ లో ఉన్నప్పటికీ, తన తండ్రి అల్లు అరవింద్‌ను పంపించి విషెస్ చెప్పించారని వినాయక్ అన్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు రాలేదని, తను వార్ షూటింగ్‌లో ఉన్నాడని వినాయక్ పేర్కొన్నారు. ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఇంటికి వచ్చి పలకరించారా అన్న ప్రశ్నకు, “కలవ, అంటే లేదు, ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు, ఏదో మాట్లాడాను అంతే. ఫోన్‌లో.” అని వినాయక్ బదులిచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

ఎన్టీఆర్  ఫోటో..

Vv Vinayak, Jrntr

Vv Vinayak, Jrntr

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us