AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మలయాళం ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. పిల్లలకు మాత్రం చూపెట్టకండి

మీకు హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లంటే ఇష్టమా? అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లు బాగా చూస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. చేత బడులు, క్షుద్ర పూజలు చేసే ఒక ఫ్యామిలీ చివరకు ఏమైందన్నది ఇందులో చక్కగా చూపించారు.

OTT Movie: ఓటీటీలో మలయాళం ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. పిల్లలకు మాత్రం చూపెట్టకండి
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 22, 2026 | 10:12 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. యాక్షన్ అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బ్లాస్ట్, అవతార్ 3 వంటి సినిమాలతో పాటు లింగం, బాహుబలి ద టార్చ్ బేరర్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్నాయి. అయితే వీటితో పాటు ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ కూడా ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు వస్తోంది. క్షుద్ర పూజలు, చేత బడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించాయి. కథ, కథనాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక బార్డర్ లో ఉండే ఓ గ్రామం తులు. అక్కడ రాజన్, భార్య లీల, కుమారుడు శ్రీ కుట్టన్ తో కలిసి జీవనం సాగిస్తుంటారు. రాజన్, లీలలు తమ కుమారుడికి ఎలాంటి లోట్లు రాకుండా కన్నుల్లో పెట్టి చూసుకుంటుంటారు. ఒక రోజు వీరు తమ పూర్వీకుల ఇంటికి వెళతారు. . అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. శ్రీ కుట్టన్ వింత వింతగా ప్రవర్తిస్తాడు. క్రూరంగా దెయ్యం పట్టిన వాడిలా బిహేవ్ చేస్తుంటాడు. దీనికి కారణం రాజన్ తల్లి గతంలో ఆ ఇంట్లో చేసిన క్షుద్ర పూజలే అని తెలుసుకుంటారు. ఆ తాంత్రిక పూజల వల్ల శ్రీ కుట్టన్ క్రమంగా రాక్షసుడిగా మారిపోతారు. కన్నబిడ్డ కళ్ల ముందే ఇలా అయిపోవడంతో లీల, తండ్రి రాజన్ కన్నీరుమున్నీరవుతారు. మరి వీరు ఆ తాంత్రిక శక్తుల నుంచి తమ కుమారుడిని కాపాడుకున్నారా? ఆ క్షుద్ర శక్తులను ఎలా ఎదుర్కొన్నారు? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ముత్తశ్శి’ (Muthassi). నందులాల్ ఎంఎస్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో కేపీఏసీ, అమిత్ చకాలక్కల్, అఖిలా భార్గవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ జూన్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ముత్తశ్శి వెబ్ సిరీస్ టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో
పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. వీడియో
ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..
ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా..
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
పాతకాలం నాటి చిట్కా.. ఇలా చేస్తే చికెన్‌ కర్రీ నీచు వాసన రాదు..
ఏపీలో 3 లక్షల ఇళ్లకు శ్రీకారం..బుర్రిపాలెం వేదికగా మరో కీలక అడుగు
ఏపీలో 3 లక్షల ఇళ్లకు శ్రీకారం..బుర్రిపాలెం వేదికగా మరో కీలక అడుగు
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..