Shiva Nirvana: ఆ సినిమా ఆగిపోలేదు.. నాని మూవీ తర్వాత ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన శివ నిర్వాణ..
టాలీవుడ్ యంగ్ దర్శకుల్లో శివ నిర్వాణం ఒకరు. ఈ కుర్రదర్శకుడు మొదటి నుంచి ఎమోషనల్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Shiva Nirvana: టాలీవుడ్ యంగ్ దర్శకుల్లో శివ నిర్వాణం ఒకరు. ఈ కుర్రదర్శకుడు మొదటి నుంచి ఎమోషనల్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి లవ్ స్టోరీతోపాటు కన్నీళ్లు పెట్టించే ఎమోషన్‌ను కూడా తన సినిమాలో చూపిస్తూ విజయాలు అందుకుంటున్నాడు శివ. ఈ క్రమంలోనే నాని నటించిన నిన్ను కోరి, నాగచైతన్య- సమంత నటించిన మజిలీ సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి టక్ జగదీష్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. నానితో కలిసి శివ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో నానికి జోడీగా రీతువర్మ నటిస్తుంది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవవుతుందనుకున్న అభిమానులు నిరాశ ఎదురైంది. ఈ టక్ జగదీష్ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ఈ విషయం పై థియేటర్స్ యజమానులకు నిర్మాతలకు మధ్య చిన్న రచ్చ జరిగిన విషయం తెలిసిందే.. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 10న స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు.
నిజానికి ఎప్పుడో విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది. అప్పట్లో విజయ్‌తో సినిమా ఉండనుందని శివ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత లైన్‌లోకి నాని వచ్చాడు. దాంతో విజయ్ సినిమా ఆగిపోయిందంటూ టాక్ వినిపించింది. తాజాగా టక్ జగదీష్ ప్రమోషన్స్‌లో భాగంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు. శివ చెప్పిన కథ నచ్చకే.. విజయ్ ఆ సినిమాకు నోచెప్పదని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా శివ ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ.. త్వరలోనే విజయ్‌తో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :