AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sekhar Kammula : ఆ డైరెక్టర్ సినిమాలు.. ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన శేఖర్ కమ్ముల..

తెలుగు సినిమా ప్రపంచంలో క్లాసికల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి మనసులోని మాటలు బయటపెట్టారు.

Sekhar Kammula : ఆ డైరెక్టర్ సినిమాలు.. ఆ హీరోయిన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం.. మనసులో మాట చెప్పిన శేఖర్ కమ్ముల..
Sekhar Kammula
Rajitha Chanti
|

Updated on: May 23, 2026 | 9:04 AM

Share

డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్న కంటెంట్ చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవలే కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకి తెలుగులో అత్యంత ఇష్టమైన దర్శకుడు బాపు అని, ఆయన సినిమాలు తనపై ఎంతో ప్రభావం చూపాయని తెలిపారు. అలాగే, అభిమాన హీరో చిరంజీవి అని, అభిమాన నటి సావిత్రి అని పేర్కొన్నారు. సావిత్రి నటన అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమెలాంటి నటీమణులను ఈ తరం చూడలేకపోతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరం నటీమణుల గురించి మాట్లాడుతూ, వారికి సరైన అవకాశాలు లభించడం లేదని, కొన్ని సందర్భాలలో ఒకే నటికి రెండు వాయిస్‌లు వినాల్సి వస్తోందని, ఇది నటన పారామీటర్స్‌ను దెబ్బతీస్తుందని శేఖర్ కమ్ముల అన్నారు. అరుంధతి చిత్రంలో అనుష్క నటన అద్భుతమని, ఆమె పాత్రకు సంపూర్ణ న్యాయం చేసిందని అన్నారు. నటనతో పాటు వేరే విభాగాలకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అనుష్క ఆ పాత్రకు ఎంతగానో సరిపోయిందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడిస్తూ, తన వివాహం ఆనంద్ సినిమా మాదిరి ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అని శేఖర్ కమ్ముల స్పష్టం చేశారు. తాను ఎం.ఎఫ్.ఎ. చదివి, కంప్యూటర్ సైన్స్ నేపథ్యంలో గ్రాఫిక్స్ చేస్తానని తన భార్య తొలుత భావించిందని వివరించారు. తాను సినిమా రంగంలోకి వస్తానని ఆమె మొదట ఊహించలేదని, తెలిసి ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదు అనే చిన్న ఫిర్యాదు ఇప్పటికీ ఆమెకు ఉందని సరదాగా తెలిపారు. సినిమా రంగం అనేది రిస్క్‌తో కూడినదని, వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడేవారని చెప్పారు. ఈ విషయంపై తమ మధ్య చర్చ ఇంకా తేలలేదని నవ్వుతూ చెప్పారు. అయితే, తాను తీసే సినిమాల వల్ల ఎప్పుడూ తలదించుకోవాల్సిన పరిస్థితి రాలేదని, అందుకే తన భార్య ఇప్పుడు సంతృప్తి చెందిందని కమ్ముల వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

తన సినిమాల పట్ల తన కుటుంబ సభ్యుల అభిప్రాయాల గురించి మాట్లాడుతూ, తన ఇంట్లో భార్యతో సహా అందరూ విమర్శనాత్మకంగా ఉంటారని తెలిపారు. ఏదైనా ఎక్కువైనా లేదా తప్పు జరిగినా చీల్చి చెండాడతారని చెప్పారు. తమది సంప్రదాయ కుటుంబమని, క్రమశిక్షణతో కూడినదని, అందరూ బాగా చదువుకున్నారని, తండ్రి విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. తన సోదరీమణులు డాక్టర్లు, గైనకాలజిస్టులు అని పేర్కొన్నారు. సంప్రదాయంతో పాటు ప్రగతిశీల ఆలోచనలు తమ కుటుంబంలో ఉన్నాయని, ఈ విషయంలో తన భార్య కూడా సంతోషంగా ఉందని తెలియజేశారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us