Ram Gopal Varma: ఆర్జీవిని ఏడిపించిన శ్రీదేవి ఫోటో.. ఇన్ స్టాలో వర్మ పోస్ట్.. ఇంతకీ ఆ పోటో ఏంటీ ?..
. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు వర్మ. ఇంట్రెస్టింగ్ విషయాలను నెట్టింట పంచుకుంటారు. తాజాగా తన అభిమాన హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి ఫోటో తనను ఏడిపించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ వర్మ షేర్ చేసిన శ్రీదేవి ఫోటో ఏంటీ స్పెషల్ ?.. ఎందుకు ఎమోషనల్ అయ్యారు అనుకుంటున్నారా ?..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అక్కినేని నాగార్జునతో ఆయన రూపొందించిన శివ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పటికీ ఎప్పటికీ యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా అది. ఆ తర్వాత క్షణ క్షణం, సర్కార్, మనీ చిత్రాలతో సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు వర్మ. ఇంట్రెస్టింగ్ విషయాలను నెట్టింట పంచుకుంటారు. తాజాగా తన అభిమాన హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి ఫోటో తనను ఏడిపించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ చేసిన ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ వర్మ షేర్ చేసిన శ్రీదేవి ఫోటో ఏంటీ స్పెషల్ ?.. ఎందుకు ఎమోషనల్ అయ్యారు అనుకుంటున్నారా ?.. అయితే వివరాలు చూసేద్దాం.
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆమెను ఎంతగా ఆరాధించాడో అనేకసార్లు చెప్పాడు. ఇక శ్రీదేవితో కలిసి రెండు సినిమాలు తెరకెక్కించాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని టెక్నాలజీ సాయంతో నటీనటుల ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దివంగత హీరో శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మళ్లీ ఈ ఇన్ స్టా యుగంలో అలనాటి తారలు జన్మిస్తే ఎలా ఉంటుందో.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వీడియోస్ అలా కనిపిస్తున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు దివంగత హీరోయిన్ శ్రీదేవి ఫోటోను సైతం.. ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఎడిట్ చేశారు. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఆ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడిపించింది అంటూ రాసుకొచ్చారు. ఆ ఫోటోలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్జీవి పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ శ్రీదేవి కంటే.. నిజమైన శ్రీదేవి మరింత అందంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
