Mahesh Babu: మహేష్, రాజమౌళి సినిమాపై విజయేంద్రప్రసాద్ ఆసక్తికర కామెంట్స్.. SSMB 29 కథేంటంటే ?..
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమా కోసం మహేష్ ఇప్పటికే న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి కావాల్సిన యాక్షన్ సీన్స్ కోసం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీపై ఇప్పిటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా వస్తుందని వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక అది కూడా మహేష్ బాబుతో అని తెలియగానే ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమా కోసం మహేష్ ఇప్పటికే న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి కావాల్సిన యాక్షన్ సీన్స్ కోసం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీపై ఇప్పిటికే భారీ అంచనాలు ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా వస్తుందని వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక అది కూడా మహేష్ బాబుతో అని తెలియగానే ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీతోనే మహేష్ పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెడుతున్నాడు. దీంతో ఎప్పటికప్పుడు ఈ మూవీపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే మహేష్, రాజమౌళి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ గురించి జక్కన్న తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
ఇటీవలే ఆయన మాట్లాడుతూ.. స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని.. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కుతుందని అన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ రాజమౌళి సినిమా ‘ఇండియానా జోన్స్’ లా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ టైటిల ఫిక్స్ కాలేదని.. భారీ బడ్జె్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే సాగుతుందని.. అలాగని ఇది పీరియాడికల్ మూవీ కాదని అన్నారు. ప్రస్తుతం ఈ మూవీకి మ్యూజిక్ గురించి చర్చలు జరుగుతున్నాయని… ఈ మూవీతో మహేష్ ఇమేజ్ మరింత పెంచేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు మరోసారి ఎస్ఎస్ఎంబీ 29పై హైప్ పెరిగిపోయింది.
ఇంతకీ ‘ఇండియనా జోన్స్’ సినిమా గురించి తెలుసా ?.. 1981లో రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తో మొదలైన ఈ ఫ్రాంఛైజీలో మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సిరీస్ లో ఆఖరి సినిమా 2023లో విడుదలైంది. యాక్షన్, అడ్వెంచర్ చిత్రాలను ఇష్టపడేవారికి దీనికి గురించి చెప్పక్క్రేలుద. ఈ చిత్రాలకు హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
