మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరోతో కలిసి వస్తున్న ‘ఆర్జీవి దెయ్యం’..

Ram Gopal Varma: టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన ఆర్జీవి..

  • Rajitha Chanti
  • Publish Date - 9:46 pm, Tue, 6 April 21
మరోసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన రామ్ గోపాల్ వర్మ.. సీనియర్ హీరోతో కలిసి వస్తున్న 'ఆర్జీవి దెయ్యం'..
Rgv Deyyam

Ram Gopal Varma: టాలీవుడ్, బాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన ఆర్జీవి.. అదే సమయంలో హరర్ సినిమాలతో ఆడియన్స్‏ను అదే రేంజ్‏లో భయపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అయితే గత కొంత కాలంగా ఆర్జీవి తన రూటు మార్చుకున్నాడు. కేవలం కాంట్రావర్సి సినిమాలపైనే ఫోకస్ చేశాడు ఆర్జీవి. ఇవే కాకుండా.. లాక్ డౌన్ సమయంలో ఏకంగా ఫోర్న్ మీడియాను తలపించేలా సినిమాలను తెరకెక్కించి అందిరికి షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. దీంతో ఆర్జీవిపై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తన తీరు మార్చుకోకుండా.. తాను తీయాల్సిన సినిమాలు తీస్తూ వెళ్లిపోయాడు.

తాజాగా ఆర్జీవి మరోసారి తన హరర్ సినిమా జోన్‏లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. భూత్’, ‘కౌన్’, ‘ఫూంక్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టిన ఆర్జీవి… మరోసారి ఆర్జీవి దెయ్యం పేరుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. స్వాతి దీక్షిత్, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఏప్రిల్ 16న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వర్మ నుంచి వస్తున్న హారర్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్బంగా ఆర్జీవి మాట్లాడుతూ.. ఈ సినిమాలో రాజశేఖర్ మేకప్ లేకుండా నటించారని.. ఆయన కూతురుగా స్వాతి దీక్షిత్ నటించిందని చెప్పుకోచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని.. అందరికి నచ్చుతుందని తెలిపాడు.

Also Read: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బ్రెయిన్ ట్యూమర్‏తో హ్యారీపోటర్ నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన సెలబ్రెటీలు..

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..