ఆ రోజే మా ఎంగేజ్‌మెంట్..! ఆహ్వాన పత్రిక కూడా రెడీ..? అసలు విషయాన్ని వెల్లడించిన గ్లామర్‌ బ్యూటీ..

Raai Laxmi Engagement News : చాలాకాలం నుంచి అభిమానులు అడుగుతున్న ప్రశ్నకు కరెక్టయిన సమాధానం చెప్పింది మన అందాల రత్తాలు.. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో

  • uppula Raju
  • Publish Date - 5:02 am, Wed, 7 April 21
ఆ రోజే మా ఎంగేజ్‌మెంట్..! ఆహ్వాన పత్రిక కూడా రెడీ..? అసలు విషయాన్ని వెల్లడించిన గ్లామర్‌ బ్యూటీ..

Raai Laxmi Engagement News : చాలాకాలం నుంచి అభిమానులు అడుగుతున్న ప్రశ్నకు కరెక్టయిన సమాధానం చెప్పింది మన అందాల రత్తాలు.. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించే రాయ్‌ లక్ష్మి తాజాగా తన పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ నెల 27న మా ఎంగేజ్‌మెంట్ అంటూ ఒక్కసారిగా కుండబద్దలు కొట్టింది. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా రెడీ అయినట్లు తెలియజేసింది.

‘‘కొంత కాలంగా చాలామంది నన్ను పదే పదే అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేయాలనుకున్నాను. నేను నా రిలేషన్‌షిప్‌ని దాచాలనుకోవడం లేదు. ఆ మాటకొస్తే నా రిలేషన్‌షిప్‌ గురించి వేరేవాళ్లకు అనవసరం. నాకంటూ కొంత స్వేచ్ఛ కావాలి. నా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటపెట్టాలనుకోవడం లేదు. మా ఎంగేజ్‌మెంట్‌ తేదీ ఫిక్సయింది. ఈ నెల 27న జరగనున్న మా నిశ్చితార్థానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను గత వారమే మా సన్నిహితులకు పంపాం. ఇది ఎప్పుడో ప్లాన్‌ చేసుకున్నది కాదు. అనుకోకుండా జరిగిందని” తెలిపింది.

అయితే ఇటీవల రాయ్‌ లక్ష్మి తండ్రి మరణించడంతో ఆమె ఎంతో వేదన అనుభవించింది. అంతేకాదు అనుకోకుండా ఓ ప్రోగ్రాంకని దుబాయ్‌ వెళ్లి అక్కడ కరోనాతో ఒంటరిగా గడిపింది. నోటి క్యాన్సర్‌ వల్ల గతేడాది తన తండ్రి కన్నుమూశారని, తర్వాత తన జీవితం ఎంతో వెలితిగా అనిపించిందని తెలిపింది. మానసికంగా ఎంతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. స్వీయ నిర్బంధంలో ఉండడం ఎంతో కష్టమని అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని హితవు చెప్పింది.

Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం

Sonusood: హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞత తెలిపిన సోనూసూద్‌.. పేదలను మోసం చేసేవారు ఊచలు లెక్కపెట్టాల్సిందే అంటూ..

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!