సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బ్రెయిన్ ట్యూమర్‏తో హ్యారీపోటర్ నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన సెలబ్రెటీలు..

Paul Ritter: హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్ (54) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్‏తో బాధపడుతున్న పాల్ ఆదివారం తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని

  • Rajitha Chanti
  • Publish Date - 9:23 pm, Tue, 6 April 21
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బ్రెయిన్ ట్యూమర్‏తో హ్యారీపోటర్ నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన సెలబ్రెటీలు..
Paul Ritter

Paul Ritter: హాలీవుడ్ నటుడు పాల్ రిట్టర్ (54) మృతి చెందారు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్‏తో బాధపడుతున్న పాల్ ఆదివారం తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతని కటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అతని మరణ వార్త విన్న పలువురు హాలీవుడ్ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (Harry Portter)

“పాల్‌ ఒక అద్భుతమైన మనిషి. అందరితో ఎంతో సరదాగా ఉండేవాడు. అలాగే నాతో కలిసి పని చేసిన వారిలో అతడు గ్రేట్‌ నటుడు. ఆయన మన మధ్య లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను” అని ఫ్రైడే నైట్‌ డిన్నర్‌ రచయిత రాబర్ట్‌ పాపర్‌ ట్వీట్‌ చేశారు. 1992లో దబిల్ చిత్రం ద్వారా పాల్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. క్వాంటమ్ ఆఫ్ సోలేస్, సన్ ఆఫ్ రాంబో, హ్యారీపోటర్, హాఫ్ బ్లడ్ ప్రిన్స్ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పాల్. చెర్నోబిల్‌ సిరీస్‌లో తన అద్భుత నటనకుగానూ ప్రశంసలు అందుకున్నారు. ‘ఫ్రైడే నైట్‌ డిన్నర్‌’లోనూ పాల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Also Read: ‘ఆచార్య’ సినిమాలో పూజా హెగ్డే పాత్ర అలా ఉండబోతుందా !!.. చరణ్‏తో కలిసి స్టెప్పులేయనున్న బుట్టుబోమ్మ..

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..