Ram Gopal Varma: అవతార్ 2పై మరో ట్వీట్ చేసిన ఆర్జీవీ.. అలా మాటిస్తే మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారంటూ..
ఈ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు' అని సినిమాపై తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశాడు ఆర్జీవీ. తాజాగా ఈ విజువల్ వండర్ మూవీపై మరోసారి ట్వీట్ చేశాడీ సీనియర్ డైరెక్టర్.

జేమ్స్ కామెరూన్ సృష్టించిన అవతార్ 2-ది వే ఆఫ్ వాటర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతోంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్రబృందాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇప్పటికే సినిమాను చూసిన ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘అవతార్-2 ను సినిమా అని పిలిస్తే అది కచ్చితంగా నేరమే అవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్, యాక్షన్స్ ఎల్లకాలం గుర్తుండిపోతాయి. ఈ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు’ అని సినిమాపై తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేశాడు ఆర్జీవీ. తాజాగా ఈ విజువల్ వండర్ మూవీపై మరోసారి ట్వీట్ చేశారు వర్మ
‘అవతార్-2’లో అందమైన నీటి ప్రపంచాన్ని చూపించారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే నటుల ప్రదర్శన.. ఊపిరి బిగబెట్టేలా ఉన్న యాక్షన్ సీన్లు.. ఇలా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమా సాగింది. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేశాడు. ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. అవతార్-2 చూసిన తర్వాత స్వర్గం అంటే పండోరా వలే ఉంటుందని ఎవరైనా మాటిస్తే.. మనుషులందరూ చచ్చిపోతారు’ అని తనదైనశైలిలో ట్వీట్ చేశారు ఆర్జీవీ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2009లో విడుదలైన అవతార్ కు సీక్వెల్‌గా జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం (డిసెంబర్ 16) విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తున్నాయి. సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను మంచు విష్ణు, సుమ కనకాల వీక్షించారు. ఇదొక విజువల్ వండర్ అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా థియేటర్‌లో దీనిని చూడాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు.



