AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ఫ్యాన్స్‏కు నీల్ క్షమాపణలు.. ‘సలార్’ రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ.. స్టోరీ లైన్ బయపెట్టేశాడు..

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 వంటి హిట్స్ తర్వాత మరోసారి అదే రేంజ్‏లో నీల్ రూపొందిస్తున్న సలార్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల తర్వాత చాలాకాలానికి ప్రభాస్ ఈ స్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు ప్రభాస్. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ చూస్తే మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేసేలా కనిపిస్తున్నారు నీల్. ఇప్పటికే అడియన్స్ ముందుకు రావాల్సిన సలార్.. ఈ ఏడాది చివరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Salaar Movie: ఫ్యాన్స్‏కు నీల్ క్షమాపణలు.. 'సలార్' రూమర్స్ పై డైరెక్టర్ క్లారిటీ.. స్టోరీ లైన్ బయపెట్టేశాడు..
Salaar, Prashanth Neel
Rajitha Chanti
|

Updated on: Nov 29, 2023 | 8:30 AM

Share

ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సలార్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 వంటి హిట్స్ తర్వాత మరోసారి అదే రేంజ్‏లో నీల్ రూపొందిస్తున్న సలార్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల తర్వాత చాలాకాలానికి ప్రభాస్ ఈ స్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు ప్రభాస్. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ చూస్తే మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేసేలా కనిపిస్తున్నారు నీల్. ఇప్పటికే అడియన్స్ ముందుకు రావాల్సిన సలార్.. ఈ ఏడాది చివరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్లు త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మొదటిసారి సలార్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఇప్పటివరకు ఈ మూవీపై వస్తోన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. సలార్, కేజీఎఫ్ చిత్రాలు ఒకే యూనివర్స్ లో తెరకెక్కాయనే రూమర్స్ పై నీల్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. సలార్ చిత్రానికి మరే సినిమాతో సంబంధం ఉండదని.. ఇది ఒక విభిన్నమైన కథ అని అన్నారు. కేజీఎఫ్ 1,2 సినిమాలను ప్రేక్షకులు ఎందుకు ఆదరించారో తనకు తెలుసని.. అందులో హీరో పాత్ర, ఇతర పాత్రలకు అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారని.. అందుకే మళ్లీ మళ్లీ అలాంటి ఎమోషనల్ కావాలనుకుంటున్నారని అన్నారు. కానీ సలార్ సినిమాకు కేజీఎఫ్ చిత్రానికి ఎలాంటి లింక్ లేదని.. రెండింటికీ కనెక్షన్ ఉందనుకున్నవారికి నిరుత్సాపరిచినందుకు క్షమాపణలు అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇక తర్వాత సలార్ స్టోరీ లైన్ బయటపెట్టేశారు నీల్. ఇద్దరు ప్రాణ స్నేహితులు కొన్ని కారణాల వల్ల బద్ధ శత్రువులుగా మారుతారని.. కాగా వారిద్ధరి మధ్య సాగే కథే ఈ సలార్ సినిమా అని అన్నారు. ఇందులో ఎమోషన్స్, ఆకట్టుకునే కథనంతో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మాత్రం ఉంటుందని.. ఆ తర్వాత స్టోరీ సెకండ్ పార్ట్ లో వస్తుందని అన్నారు. ఇంతకు ముందు చిత్రాల్లో ఉన్నట్లుగానే ఇందులోనూ సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయని.. యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అన్నారు. ఇందులో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, శ్రుతి హాసన్ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.