Meher Ramesh: మెహర్ రమేష్ ఆ స్టార్ హీరోకు ఫ్రెండ్‌గా నటించాడని మీకు తెలుసా..?

తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో దాంతో మెహర్ రమేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. ఆయన పై నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు.  మెహర్ రమేష్ ముందుగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారారు. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

Meher Ramesh: మెహర్ రమేష్ ఆ స్టార్ హీరోకు ఫ్రెండ్‌గా నటించాడని మీకు తెలుసా..?
Meher Ramesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 17, 2023 | 11:28 AM

దర్శకుడు మెహర్ రమేష్ రీసెంట్ గా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో దాంతో మెహర్ రమేష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్. ఆయన పై నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు.  మెహర్ రమేష్ ముందుగా కన్నడ సినిమాతో దర్శకుడిగా మారారు. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే మరోసారి పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అజయ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతర్వాత తెలుగులో సినిమాలు చేశారు మెహర్ రమేష్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి 2008లో కంత్రి అనే సినిమా చేశారు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమా తెరకెక్కించాడు మెహర్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లో స్టైలిష్ మూవీగా నిలిచింది బిల్లా. ఆతర్వాత 2011లో ఎన్టీఆర్ తో కలిసి శక్తి అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 2013లో వెంకటేష్ తో కలిసి షాడో అనే సినిమా చేశారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది.

దాంతో మెహర్ రమేష్ పదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. పదేళ్ల తర్వాత రీసెంట్ గా భోళా శంకర్ సినిమా చేశారు. ఈ సినిమాకూడా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే మెహర్ రమేష్ మహేష్ బాబు సినిమానిమాలో నటించారన్న విషయం తెలుసా..? మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో మెహర్ రమేష్ నటించారు. ఆ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా కనిపించారు మెహర్ రమేష్. బాబీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకూడా డిజాస్టర్ గా నిలిచింది.

Mehar Ramesh

బాబీ సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ సునీల్( నీచ్ ) పాత్రలో కనిపించాడు మెహర్ రమేష్. 

View this post on Instagram

A post shared by Meher Ramesh (@meherramesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్