Ram Charan – Game Changer: ఇది చాలయ్యా..! చెర్రీ గేమ్ చేంజర్ లుక్ అదిరిపోయింది..
ఓ పక్క ప్రభాస్.. మరో పక్క మహేష్.. ఇంకో పక్క బాబాయ్ పవర్ స్టార్. వీళ్లందరూ తాము చేస్తున్న సినిమాలతో.. ఆ సినిమా అప్డేట్లతో.. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటే.. చెర్రీ మాత్రం అసలు ఉలుకూ పలుకు లేకుండా.. సైలెన్స్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తన గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ను ఇవ్వకుండానే ఉంటున్నారు. ఇక చెర్రీకి తోడు.. శంకర్ కూడా.. గేమ్ చేంజర్ ఊసెత్తకుండానే..
ఓ పక్క ప్రభాస్.. మరో పక్క మహేష్.. ఇంకో పక్క బాబాయ్ పవర్ స్టార్. వీళ్లందరూ తాము చేస్తున్న సినిమాలతో.. ఆ సినిమా అప్డేట్లతో.. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటే.. చెర్రీ మాత్రం అసలు ఉలుకూ పలుకు లేకుండా.. సైలెన్స్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. తన గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ను ఇవ్వకుండానే ఉంటున్నారు. ఇక చెర్రీకి తోడు.. శంకర్ కూడా.. గేమ్ చేంజర్ ఊసెత్తకుండానే.. ఇండియన్ 2 సినిమా సెట్లో బిజీగా గడిపేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది.. గేమ్ చేంజర్ అప్డేట్ ఏంటని.. ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే వరకు తెచ్చుకుంటున్నారు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలోనే.. మెగా అండ్ చెర్రీ ఫ్యాన్స్ ఎదురుచూపుల మధ్యలోనే.. సోషల్ మీడియలో ఓ ఫోటో షేర్ అయింది. స్వాతంత్ర్య సాధకుడు.. శాంతి కాముకుడైన గాంధీ ముందర.. తీక్షణంగా చూస్తూ.. పిడికిలి బిగించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించడం ఒక్క సారిగా అందరనీ ఉలికిపడేలా చేసింది. గేమ్ చేంజర్ మూవీలో.. చెర్రీ మరో లుక్ ఇదే అనే ఫీల్ అందర్లో కలిగించింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య సంబరాల్లో భాగం కూడా అయింది.
ఇక అసలు విషయం ఏంటంటే..! పంద్రాగస్ట్ సందర్భంగా చెర్రీస్ గేమ్ చేంజర్ మూవీ డైరెక్టర్ శంకర్.. ఆ సినిమా సెట్లో వర్క్ చేస్తున్న పిక్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. ఫ్రమ్ ది సెట్స్ ఆఫ్ గేమ్ చేంజర్ అంటూ.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ.. ఆ పిక్ కింద కోట్ చేశారు. ఇక పిక్‌నే తీసుకున్న కొంత మంది చెర్రీ డైహార్డ్ ఫ్యాన్స్ .. తమ ఫోటో షాపీ స్కిల్స్‌తో.. డైరెక్టర్ శంకర్‌ను లేపేసి.. అదే ప్లేస్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోను పెట్టారు. ధృవ సినిమాలో ఓ స్టిల్‌ను .. శంకర్ షేర్ చేసిన ఫోటోతో పర్ఫెక్ట్ గా ఎడిట్ చేశారు. అఫీషియల్ లుక్‌లా.. మార్చేశారు. ఇప్పుడా పిక్‌తోనే.. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ మూవీని వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...