Lokesh Kanagaraj: లోకేష్ LCUలో రాబోతున్న సినిమాలు ఇవే.. ఫ్యాన్స్ కు పూనకాలే..
తమిళ సినిమాల్లో యాక్షన్, స్మగ్లింగ్ వంటి ఆసక్తికరమైన కథాంశాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలు తీస్తున్నాడు.మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించాడు.
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్, సూర్య, కమల్, కార్తీక్ ఇలా పలువురు తమిళ ప్రముఖులతోపాటు కొత్త తరహాలో సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాల మాదిరి ఒక్కో సినిమాకు తన డైరెక్షన్ ను మేళవించి తదుపరి సినిమాలు రూపొందిస్తున్న దర్శకుల్లో లోకేష్ మొదట స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నటుడు రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు లోకేష్. కింగ్ నాగార్జున ఈ సినిమాలో రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు లోకేష్ తన రాబోయే LCUలో ఇంకా ఎన్ని సినిమాలు ఉంటాయో మాస్ అప్ డేట్ ఇచ్చాడు.
తమిళ సినిమాల్లో యాక్షన్, స్మగ్లింగ్ వంటి ఆసక్తికరమైన కథాంశాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలు తీస్తున్నాడు.మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ కు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత 2017లో విడుదలైన మహానగరం చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా తమిళ చిత్రసీమలో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. శ్రీ, సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా నటించిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
క్రైమ్, యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా విడుదలైన తర్వాత, అతను తన రెండవ చిత్రంలో కార్తీతో ఖైదీ సినిమా చేశాడు. ఈ సినిమా లోకేశ్‌కి క్రిటికల్‌గానూ, కమర్షియల్‌గానూ పెద్ద హిట్‌గా నిలిచింది. లోకేష్ ఈ చిత్రాన్ని తన LCU పోర్ట్‌ఫోలియోలో మొదటి చిత్రంగా ప్రకటించాడు. ఖైదీ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత అతను తన మూడవ సినిమాని దళపతి విజయ్ తో చేసాడు. 2021లో విడుదలైన మాస్టర్‌కి విజయ్ అభిమానులు , ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఎప్పుడూ యాక్షన్, థ్రిల్లర్ కథాంశాలతో సినిమాలు చేసే లోకేష్ ఈ సినిమాని కూడా ఆ స్టైల్‌లోనే తెరకెక్కించాడు. విజయ్ మాస్టర్‌లో మాళవిక మోహన్, ఆండ్రియా జెరేమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ నటించారు. ఆతర్వాత విక్రమ్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో నటించాడు. ఆ తర్వాత దళపతి విజయ్ తో లియో సినిమా చేశాడు. ఇదిలా ఉంటే లోకేష్ తన LCU గురించి మరొక అప్‌డేట్ ఇచ్చాడు. అందులో తాను దర్శకత్వం వహించిన మొదటి 3 సినిమాలు లకు కంటిన్యూగా , 4వ సినిమా ఉంటుందని.. అలాగే దానికి కంటిన్యూగా, 5వ సినిమా తర్వాతిది, 6వ సినిమా , 7వ లేదా 8వ సినిమాతో LCU ముగింపు అని చెప్పాడు. ఆ క్రమంలో తాను ఖైదీ 2కి దర్శకత్వం వహిస్తానని, నటుడు విజయ్ ఒప్పుకుంటే రోలెక్స్, లియో 2 పాత్రలోతో సోలో చిత్రానికి దర్శకత్వం వహిస్తానని, లేకపోతే విక్రమ్ 2 ఈ LCU లో చివరి చిత్రం అవుతుంది అని తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.