Krishna Vamsi: చిరంజీవి ఇచ్చిన ఆ గిఫ్ట్‌ వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా: డైరెక్టర్‌ కృష్ణవంశీ

Megastar Chiranjeevi: స్వయంకృషితో టాలీవుడ్‌ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. ఎంత ఎదిగినా ఒదిగుండే ఆయన వ్యక్తిత్వం ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. వారే కాదు యంగ్‌ హీరోలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకునే సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

Krishna Vamsi: చిరంజీవి ఇచ్చిన ఆ గిఫ్ట్‌ వల్లే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా: డైరెక్టర్‌ కృష్ణవంశీ
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2022 | 3:51 PM

Megastar Chiranjeevi: స్వయంకృషితో టాలీవుడ్‌ మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. ఎంత ఎదిగినా ఒదిగుండే ఆయన వ్యక్తిత్వం ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. వారే కాదు యంగ్‌ హీరోలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకునే సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఇక సీనియర్‌ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనను అభిమానిస్తారు. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) కూడా ఒకరు. ఆయనకు మెగాస్టార్‌ అంటే ఎనలేని ప్రేమ. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగాను అన్నయ్య అంటే చాలా ఇష్టమంటున్నాడీ క్రియేటివ్‌ డైరెక్టర్‌. ఆయన వల్లే తాను ప్రాణాలతో ఉన్నానంటూ మెగాస్టార్‌పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారాయన.

అన్నయ్య మాట కాదనలేక..

‘నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆయన ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నారు. తోటి నటీనటులు, ఇతర చిత్రబృందాన్ని ఆయనెప్పుడూ గౌరవిస్తారు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం. వ్యక్తిగతంగానూ అన్నయ్యతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు గోవిందుడు అందరివాడేలేఛాన్స్‌ ఇచ్చారు. గతంలో చిరంజీవితో కలిసి నేనొక యాడ్‌ చేశాను. దాని డబ్బింగ్‌ సమయంలో.. ‘అన్నయ్యా.. మీకు బాగా ఇష్టమైన వ్యక్తికి ఈ కారు గిఫ్ట్‌గా ఇచ్చేస్తారా?’ అని చిరుని సరదాగా అడిగాను. కొన్నిరోజుల తర్వాత ఇంటికి పిలిచి మరీ.. ‘ఈ కారు నీకే బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నా’ అని అడిగాడు. నేను వద్దని చెప్పాను. నాకు బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు.. ఒకవేళ ఇచ్చిన నా దగ్గర అవి ఎక్కువ కాలం ఉండవు’ అని అంటే ‘ అన్నయ్యా అని పిలుస్తున్నావ్‌. మరి, ఈ అన్నయ్య గిఫ్ట్‌ ఇస్తే తీసుకోవా?’ అని అడిగారు. దీంతో అన్నయ్య మాట కాదనలేక దాన్ని తీసుకున్నా. దానితో ఎన్నో సాహసాలు చేశాను. ఓసారి వ్యక్తిగత పనుల నిమిత్తం నందిగామ వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌ జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో నాకూ, డ్రైవర్‌కు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా నేను బయటపడ్డానంటే అన్నయ్య ఇచ్చిన కారు వల్లే’ అని అప్పటి క్షణాలను గుర్తుచేసుకున్నారు కృష్ణవంశీ.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. నక్షత్రం సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత రంగ మార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కృష్ణవంశీ. మరాఠీ సూపర్‌ హిట్‌ ‘నట సామ్రాట్‌’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..