Mahesh Babu: మహేష్- గురూజీ సినిమా గురించి వస్తోన్న ఆ వార్తలనీ అవాస్తవాలేనట..

మహేష్ బాబు సినిమాకోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అనుకున్న విషయం తెలిసిందే.

Mahesh Babu: మహేష్- గురూజీ సినిమా గురించి వస్తోన్న ఆ వార్తలనీ అవాస్తవాలేనట..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 17, 2022 | 4:00 PM

మహేష్ బాబు(Mahesh Babu) సినిమాకోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. మహేష్ ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అనుకున్న విషయం తెలిసిందే. పోకిరి సినిమా తర్వాత ఆ తరహాలో మహేష్ తన స్టైల్ మార్చి నటించిన సినిమా ఇది. మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 12న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 28 మూవీ గా వస్తోన్న ఈ సినిమా కోసం గురూజీ ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడట. గతంలో ఈ ఇద్దరు కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పక్క యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్ , త్రివిక్రమ్.

ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో నిర్వహించారు. ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. చకచకా షూటింగ్ జరిపి ఈ సినిమాసమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సాగే కథతో ఉంటుందని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మహేష్ సినిమాను పక్కా ఫ్యామిలీ కథతో తెరకెక్కిస్తున్నారట గురూజీ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ (చినబాబు)నిర్మిస్తున్న SSMB28 సినిమాలో మరో హీరోయిన్ గా పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తోంది టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి