- Telugu News Entertainment Tollywood Director Krishna Vamsi Gives Clarity On Soundarya Saree Color Change In Asalem Gurthukuradhu Song
Soundarya: సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
అందాల భామ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు సౌందర్య. సౌందర్య అద్భుత నటనకు ఉదాహరణ అంతఃపురం సినిమా అనే చెప్పాలి.
Updated on: Jul 21, 2024 | 2:41 PM

అందాల భామ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు సౌందర్య. సౌందర్య అద్భుత నటనకు ఉదాహరణ అంతఃపురం సినిమా అనే చెప్పాలి.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన చాలా మందికి అవార్డులు వచ్చాయి.

ఈ సినిమాలో ఇళయ రాజా సంగీతం అందించారు. ఇక ఈ మూవీలో అసలేం గుర్తుకు రాదు అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది. అప్పట్లో ఈ సాంగ్ సెన్సేషన్ గా మారింది. ఇప్పటికీ ఈ పాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది.

అయితే ఈసాంగ్ ను సముద్రం మధ్యలో షూట్ చేశారు. పడవలో సాయికుమార్, సౌందర్య పై ఈ సాంగ్ చేశారు కృష్ణవంశీ. అయితే సాంగ్ లో సౌందర్య చీర రంగులు మారడం ప్రేక్షకులను అల్కట్టుకుంది. ఒకటే చీరను గ్రఫిక్స్ లో కలర్స్ మార్చారు.

తాజాగా దీనిపై కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో దీని పై స్పందిస్తూ.. మేము షూట్ చేసింది, రిలీజ్ చేసింది ఒక్క చీర మీదే.. థియేటర్స్ లోనూ ఒకటే కలర్ ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత జెమినీ టీవీ ఛానల్ లో ఎడిటర్ చేంజ్ చేసాడు అని తెలిపారు కృష్ణవంశీ.





























