Video: ఇదేందయ్యా ఫిలిప్స్.. ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే బెస్ట్
Glenn Phillips Stunning Catch: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు 252 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఈ క్రమంలో తుఫాన్ ఆరంభం అందించిన రోహిత్, గిల్.. వంద పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Glenn Phillips Stunning Catch: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి ఇంటర్నెట్‌లో అందరినీ షాక్‌కి గురిచేశాడు. 28 ఏళ్ల గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో క్యాచ్‌లతో ఆశ్చర్యపరిచిన ఈ కివీస్ ప్లేయర్.. తాజాగా శుభ్‌మాన్ గిల్‌కు మైండ్ బ్లాక్ చేసేశాడు. దీంతో షాకైన గిల్ 31 పరుగులకే తన ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో మొదటి వికెట్‌కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. 19వ ఓవర్ 4వ బంతికి, గిల్ ఏరియల్ షాట్‌తో బౌండరీని దాటించేందుకు ప్రయత్నించాడు. కానీ, షార్ట్-ఎక్స్‌ట్రా కవర్ పొజిషన్‌లో నిలబడిన ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్లో పూర్తి చేశాడు. దీంతో గిల్ షాక్‌కు గురయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదొక బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతకుముందు మ్యాచ్‌లోనూ కోహ్లీని కూడా ఇలాంటి క్యాచ్‌తో షాక్‌కి గురిచేశాడు.
What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw
— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025
జట్లు:
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








