Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్నే అలా అంటావా.. జెలెన్‌స్కీకి డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌ వీడియో

నన్నే అలా అంటావా.. జెలెన్‌స్కీకి డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌ వీడియో

Samatha J

|

Updated on: Mar 09, 2025 | 3:05 PM

ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీకి, డొనాల్డ్‌ ట్రంప్‌నకు మధ్య ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదం చోటుచేసుకుంది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధంపై శాంతి, ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

 ఇద్దరు నేతలు మీడియా, పలువురు దౌత్యవేత్తల సమక్షంలో రష్యా యుద్ధం గురించి గొడవవడ్డారు. మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారని, అమర్యాదగా ఉన్నారంటూ జెలెన్‌స్కీని ట్రంప్‌ నిందించగా, దానికి జెలెన్‌స్కీ దీటుగా బదులిచ్చారు. దీంతో 10 నిముషాల పాటు సమావేశంలో వాతావరణం వేడెక్కింది. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ముగించే ఒప్పందం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తన సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అమెరికా నుంచి ఆర్థిక సాయం నిరంతరం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యుద్ధం ముగింపు చాలా దూరమన్న జెలెన్‌స్కీ వ్యాఖ్యలపై ట్రంప్‌ మండిపడ్డారు. ఇది వరస్ట్‌ స్టేట్‌మెంట్‌ అని దుయ్యబట్టారు. జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవట్లేదని విమర్శించారు. ఈ క్రమంలో సైనిక సాయాన్ని నిలిపివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రభాస్ పై తప్పుడు వార్తలు.. హీరో సీరియస్ వీడియో

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె వీడియో

ఇద్దరి ప్రాణాలను తీసిన ‘వాట్సాప్‌ ముద్దు’.. అసలేమైదంటే? వీడియో

చెల్లి పెళ్లికి అన్న షాకింగ్ గిఫ్ట్.. అతిథులతో కన్నీళ్లు పెట్టించిన కానుక వీడియో