Krish Jagarlamudi : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ లేని హీరో అతడు : క్రిష్

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండ‌పొలంతో  అందరినీ మెస్మరైజ్ చేశారు.

Krish Jagarlamudi : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ లేని హీరో అతడు : క్రిష్
Krish

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం కొండ‌పొలంతో  అందరినీ మెస్మరైజ్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కీరవాణి సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. తాజాగా ఈ సినిమా గురించి క్రిష్ మాట్లాడుతూ ఆసక్తిగా విషయాలను పంచుకున్నారు.

నీళ్లు లేక గొర్రెల కాపర్లు అందరూ కలిసి వాటిని తీసుకుని కొండమీదకు వెళ్తారు అక్క‌డ జ‌రిగే ప‌రిణామాలేంటి? అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట గోవాకు వెళ్లి షూటింగ్ చేద్దామని అన్నారు. గొర్రెలను అడ‌వుల‌కు తీసుకెళ్తే పులులు వస్తాయని పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమల టైగర్ జోన్. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో షూట్ చేశాం అన్నారు. అలాగే  కరోనా సమయంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వింత వింతగా అనిపించింది. అన్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లాం. మళ్లీ మళ్లీ సిటీకి వచ్చి చేయడానికి వీల్లేదు. మేం కూడా బాయ్‌లానే కెమెరాలను  మోశాం. ఇక వెయ్యి గొర్రెలను అడవిలోకి తీసుకెళ్లడం. వాటితో షూట్ చేయడం చాలా కష్టంగా మారింది. అలా కరోనా సమయం, అడవిలో షూటింగ్ చేయడం అనేది సవాళ్లుగా మారాయి.

ఊరి జనాభాకే నీళ్లు లేనప్పుడు.. గొర్రెలకు ఎక్కడి నంచి తెస్తారు. అందుకే వాటిని కొండ ప్రాంతానికి తీసుకెళ్తారు. సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరి అవుతాం. అది చాలా కష్టమైన పని. పిక్ నిక్ వెళ్లడంలా ఉండదు. అడ్వెంచెరస్ జర్నీ. గొర్రెల భాష రాలేదు. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ఓ చిన్నపిల్లవాడు వస్తే మాత్రం ఆ గొర్రెలన్నీ కూడా అతని వెనుకే వచ్చాయి. ఆ టెక్నిక్ వైష్ణవ్ పట్టేశాడు అన్నారు క్రిష్. ఆలాగే  వైష్ణవ్ తేజ్‌కు  నేర్చుకోవాలనే  తపన ఎంతో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ అస్సలు ఉండదు. అది అస్సలు అతనికి తెలియదు. సెట్‌లో అందరికంటే ముందుంటాడు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా పరిశీలిస్తుంటాడు. ప్రతీ సీన్‌ను కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తాడు. సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఉప్పెనలాంటి కథను ఎంచుకున్నాడు.. కొండపొలం కూడా ఎంచుకున్నాడు. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Maa Elections 2021: ‘నిన్న గెలిచిన నేను.. నేడు ఎలా ఓడిపోయానబ్బా’.. ఫలితం మారడంపై అనసూయ ఆసక్తికర ట్వీట్‌..

Nagababu: ‘మా’ రాజీనామా పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు..

Mohanbabu: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ‘మా’ఎన్నికలపై మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు..

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu