AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena movie: బుచ్చిబాబు షేర్ చేసిన బేబమ్మ కష్టాలు.. ‘ఉప్పెన’ నుంచి మేకింగ్ వీడియో..

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‏లోకి హీరోగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులో వైష్ణవ్‏కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‏గా

Uppena movie: బుచ్చిబాబు షేర్ చేసిన బేబమ్మ కష్టాలు.. 'ఉప్పెన' నుంచి మేకింగ్ వీడియో..
Uppena Making Video
Rajitha Chanti
|

Updated on: Apr 11, 2021 | 10:20 PM

Share

మెగా మేనల్లుడిగా టాలీవుడ్‏లోకి హీరోగా ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇందులో వైష్ణవ్‏కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‏గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. మంచి హిట్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ కలసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చక్కటి ప్రేమకథతోపాటు సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు పైకెక్కించింది. ముఖ్యంగా నీకన్ను నీలి సముద్రం అనే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే జలజల జలపాతం అంటూ సాగే పాటకూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకింగ్ వీడియోలను ఒక్కక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్.

ఇటీవల జల జల జలపాతం మేకింగ్ వీడియోను చేసాడు డైరెక్టర్ … తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలలో బేబమ్మగా నటించడానికి కృతిశెట్టి ఎంతకష్టపడిందో అర్థమవుతుంది. అలాగే ఆ సినిమా కోసం డైలాగ్స్ చెప్పడానికి కృతి ప్రయత్నిస్తున్న సీన్స్ కూడా చూడొచ్చు. అలాగే బుచ్చిబాబు.. లోకెషన్‏లో ఎంత కచ్చితంగా.. హుషారుగా ఉన్నాడో కూడా చూడొచ్చు. అలాగే యాక్షన్స్ సీన్స్ ఎలా చిత్రీకరించి.. క్లాస్ రూమ్ సీన్స్ ఎలా తీశారు అనేది కూడా చూడోచ్చు.

వీడియో..

వీడియో..

Also Read: Akhil Movie: టాలీవుడ్‏ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్‏ కోసం స్పెషల్ రోల్‏లో…

తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‏లో ఉన్న శ్యాం సింగరాయ్..

మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..

షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..