SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్… ఈసారి ఏం చేశాడంటే..

సోనూ సూద్.. మరిసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తూ.. రియాల్ హీరోగా మారాడు.

SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్... ఈసారి ఏం చేశాడంటే..
Sonu Sood
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 11, 2021 | 10:24 PM

సోనూ సూద్.. మరిసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తూ.. రియాల్ హీరోగా మారాడు. వలస కార్మికులకు అండగా నిలిచాడు. దీంతో పలు చోట్ల సోనూసూద్‏కు గుడి కట్టి పూజలు చేయడమే కాకుండా.. తమ పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ ప్రజాసేవ మరిచిపోవడం లేదు. తాజాగా తన అభిమాని అడిగిన వెంటనే ఏకంగా సెల్ టవర్ నిర్మించేశాడు. తమ గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం లేదని ఓ అభిమాని ట్వీట్ చేయడంతో.. వెంటనే స్పందించిన సోనూసూద్.. ఆ ఊర్లో ఒక సెల్ టవల్ నిర్మించాడు.

వివరాల్లోకెళితే.. మహారాష్ట్రలోని గోడియా జిల్లాకు చెందిన అన్మోల్ బిరన్వార్, మున్నా బిరన్వార్ అనే సోదరులు కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు 50 మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అయితే వారి గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా రావడం లేదని.. దీంతో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కష్టంగా మారిందని.. ఈ విషయంలో తమకు సాయం చేయాలంటూ అన్మోల్ బిరన్వార్ సోనూసూద్ కు సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. వారి ట్వీట్ కు స్పందించిన సోనూసూద్ తన స్నేహితుడు కరణ్ గిల్హోత్రా సాయంతో ఓ సెల్ టవర్ నిర్మాణాన్ని చెపట్టారు. ఇటీవల ఆ టవ్ నిర్మాణం పూర్తికావడంతో… ఆ గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయం ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్తులకు ఇంటర్నెట్ కష్టాలు తీరిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాగా.. మారోసారి సోనూసూద్ కు హాట్సాఫ్ చెబుతున్నారు.

ట్వీట్..

Also Read: షాకింగ్ లుక్‏లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‏ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..