Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెమ్యునరేషన్ వద్దన్న అట్లీ.? అసలు మ్యాటర్ అదేనా..

షారుక్‌తో ‘జవాన్‌’ సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు అట్లీ. జవాన్ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు 1000కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో అట్లీ తో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. అలాగే అట్లీ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే అట్లీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెమ్యునరేషన్ వద్దన్న అట్లీ.? అసలు మ్యాటర్ అదేనా..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2024 | 1:05 PM

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ విపరీతంగా పెరిగిపోయింది. మొన్నటి వరకు సౌత్ వరకే అట్లీ పేరు తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. షారుక్‌తో ‘జవాన్‌’ సినిమా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు అట్లీ. జవాన్ సినిమా సంచలన విజయం సాధించడమే కాదు 1000కోట్ల వరకు వసూల్ చేసింది. దాంతో అట్లీ తో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి. అలాగే అట్లీ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే అట్లీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. తాజాగా అట్లీ కి సంబందించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.

అయితే అట్లీ అల్లు అర్జున్ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట.. రెమ్యునరేషన్ కు బదులు లాభాల్లో వాటా అడగాలని అట్లీ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ తో సినిమాకి పారితోషికం కాకుండా షేర్ అడుగుతున్నట్లు గాసిప్ స్ప్రెడ్ అవుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. ఆతర్వాత అట్లీతో సినిమా చేయనున్నాడు బన్నీ. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే ఈ దర్శకుడి రెమ్యూనరేషన్ పై టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు మొదలయ్యాయి.

‘పుష్ప 2’ సినిమా తర్వాత అల్లు అర్జున్నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతాయి. ఆ అంచనాకు తగ్గట్టుగా సినిమా తీయాలి అంటే దర్శకుడిపై బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే అట్లీ పారితోషికం కాకుండా లాభాల్లో వాటా అడిగారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మేసేజ్ లతో మాస్ సినిమాలు తీయడంలో అట్లీ ఫేమస్. కోలీవుడ్ లో దళపతి విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అట్లీ, షారూఖ్‌ ఖాన్‌ కాంబోలో వచ్చిన ‘జవాన్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ తర్వాత అట్లీ పాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు సొంతం చేసుకున్నాడు.

View this post on Instagram

A post shared by Atlee Kumar (@atlee47)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
60కు చేరువైనా పెళ్లి ఊసెత్తని సల్మాన్.. అసలు విషయం ఇదే!
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
మీరు కూడా మహా కుంభమేళకు వెళ్తున్నారా..? ఈ చారిత్రక ప్రదేశాలను
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు