Director Atlee: ఆ హీరోతో దేశం గర్వించేలా సినిమా తీస్తాను.. డైరెక్టర్ అట్లీ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన సినిమా జవాన్. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు తన ఆరో సినిమాను ప్రకటించారు. ఆ స్టార్ హీరోతో దేశం గర్వించేలా సినిమా తెరకెక్కిస్తానని అనౌన్స్ చేశాడు డైరెక్టర్ అట్లీ.

Director Atlee: ఆ హీరోతో దేశం గర్వించేలా సినిమా తీస్తాను.. డైరెక్టర్ అట్లీ సంచలన కామెంట్స్..
Atlee
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 18, 2024 | 1:28 PM

జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతార, దీపికా పదుకొణే నటించిన ఈ మూవీ దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత అట్లీ రూపొందించే ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా తన ఆరో సినిమాను ప్రకటించారు అట్లీ. ప్రస్తుతం ఏ6 అనే వర్కింగ్ టైటిల్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం అట్లీ ‘బేబీ జాన్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. నిర్మాతగా ఆయన నిర్మించిన మొదటి సినిమా ఇదే.

ఈ చిత్రానికి కాలీస్ దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా అట్లీ మాట్లాడుతూ.. “A6 చిత్రానికి చాలా సమయం, శక్తి అవసరం. స్క్రిప్ట్ చివరి దశలో ఉన్నాం. దేవుడి దయ వల్ల త్వరలోనే పెద్ద ప్రకటన వెలువడనుంది” అని అన్నారు అట్లీ. “నటీనటుల ద్వారా అందరినీ ఆశ్చర్యపరచబోతున్నాను. మీరు అనుకుంటున్నది నిజమే (సల్మాన్ ఖాన్ నటిస్తారనే ఆలోచన). అయితే ఆయనతో రూపొందించే ఈ సినిమా కచ్చితంగా భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. మాకు చాలా ఆశీర్వాదాలు, ప్రార్థనలు కావాలి. ప్రస్తుతం పాత్రల ఎంపిక జరుగుతోంది. మరికొద్ది వారాల్లో అంతా ఫైనలైజ్ అవుతుంది” అని అన్నారు.

ఈ సినిమాలో రజనీ లేదా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నటీనటుల గురించి అట్లీ చెప్పిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘జవాన్’ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆయన ఏ సినిమా చేయలేదు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.