Allu Arjun: అల్లు అర్జున్‏తో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మురుగదాస్..

ఒక దర్శకుడు కూడా అనేకమంది హీరోలను కలుస్తాడని.. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం తమ సినిమా ప్రాథమిక దశలోనే ఉందని.. ఇంతకు మించి చెబితే అదే హెడ్డింగ్ పెడతారంటూ చెప్పుకొచ్చారు.

Allu Arjun: అల్లు అర్జున్‏తో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ మురుగదాస్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2023 | 9:06 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఏఆర్. మురగదాస్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్బార్ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. అయితే ఆయన దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తారని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన నిర్మించిన 16 ఆగస్ట్ 1947 సినిమా ప్రచార కార్యక్రమాలను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బన్నీతో తాను చేయబోయే సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా అందరికీ చాలా గ్యాప్ వచ్చిందని.. లాక్ డౌన్ కారణాంగా ఇంట్లో ఉండడంతో అనేక పుస్తకాలు చదివినట్లు తెలిపారు. అలాగే అల్లు అర్జున్ తో తాను చేయబోయే సినిమా లైన్లో ఉందని తెలిపారు. ఒక హీరో చాలా మంది దర్శకులను కలుస్తాడని.. అలాగే ఒక దర్శకుడు కూడా అనేకమంది హీరోలను కలుస్తాడని.. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం తమ సినిమా ప్రాథమిక దశలోనే ఉందని.. ఇంతకు మించి చెబితే అదే హెడ్డింగ్ పెడతారంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తాను తెలుగులో కచ్చితంగా ఒక సినిమా చేస్తానని అన్నారు. ప్రేక్షకుడి అంచనాలు.. దర్శకుడి క్రియేటివిటీ కలిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్టవుతుందని.. ఎప్పుడైనా ప్రేక్షకుడి అంచనాలను అందుకోగలగాలని అన్నారు. 16 ఆగస్ట్ 1947 చిత్రానికి అందరూ కష్టపడి పనిచేశారని.. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఆ మేజిక్ పోతుందని అన్నారు. ప్రస్తుతం ఓటీటీలు కూడా అందుబాటులోకి వచ్చాయని.. ఇతర భాషల చిత్రాలను చాలా మంది సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారని.. అందుకే డబ్ చేస్తున్నట్లు చెప్పారు.

16 ఆగస్ట్ 1947 చిత్రంలో గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా సెన్సిబుల్ డ్రామా అని.. చాలా వరకు వాస్తవిక పద్ధతిలో రూపొందించినట్లు చెప్పారు. 1947లో భారత స్వాతంత్ర్యానికి ఒక రోజు ముందు బానిసత్వానికి రాజధానిగా వర్ణించబడిన సంగడు అనే గ్రామంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
ఆ ప్రశ్నతో రామ్ చరణ్‏ను ఇరికించిన బాలయ్య..
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
మార్చి నెలాఖరు నాటికి TGPSC గ్రూప్‌ 1 నియామకాలు పూర్తి: CM రేవంత్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
ఇంటి నుంచి దోమల్ని తరిమికొట్టాలంటే.. అరటి పండుతో ఇలా చేస్తే చాలు!
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
డిగ్రీ అర్హతతో కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. ఎన్ని పోస్టులున్నాయంటే
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు