AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో దిల్ రాజు కొడుకు.. ఎయిర్ పోర్టులో అన్వయ్ అల్లరి మాములుగా లేదుగా.. వీడియో

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టీజీర్ రిలీజ్ ఈవెంట్ శనివారం (నవంబర్10) లక్నో వేదికగా అట్టహాసంగా జరిగింది. రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు చిత్ర బృందమంతా ఈ ఈవెంట్ లో సందడి చేసింది. ఇక దిల్ రాజు కుమారుడు అన్వయ్ అయితే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.

Dil Raju: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో దిల్ రాజు కొడుకు.. ఎయిర్ పోర్టులో అన్వయ్ అల్లరి మాములుగా లేదుగా.. వీడియో
Dil Raju Family
Basha Shek
|

Updated on: Nov 10, 2024 | 6:48 AM

Share

ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అంజలి మరో హీరోయిన్ గా కనిపించనుంది. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (నవంబర్10) లక్నో వేదికగా గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, శంకర్, శ్రీకాంత్, ఎస్ జే సూర్య తదితరులు ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఇక నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. తన భార్య తేజస్విని, కుమారుడు అన్వయ్ తో కలిసి గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. అంతకు ముందు లక్నో ఎయిర్ పోర్ట్ లో వీరి విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా దిల్ రాజు కొడుకు అన్వయ్ క్యూట్ గా అల్లరి చేస్తూ, విమానాశ్రయంలో చక్కర్లు కొడుతూ కెమెరాల కంట పడ్డాడు. ఇక కెమెరాల వైపు చూసి నమస్కారం పెట్టమని దిల్ రాజు కూడా చెప్పడంతో క్యూట్ గా హాయ్ చెప్పి అందరికీ నమస్కారం పెట్టాడు అన్వయ్. ప్రస్తుతం దిల్ రాజు తనయుడు అన్వయ్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రేక్షకులు, అభిమానులు అన్వయ్ అప్పుడే ఇంత పెద్దోడు అయిపోయాడా, క్యూట్ గా ఉన్నాడు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో 2020లో తన దూరపు బంధువు తేజస్విని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. గతేడాది దిల్ రాజు తనయుడు అన్వయ్ మొదటి పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో దిల్ రాజు ఫ్యామిలీ.. వీడియో

దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎస్ జే సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే తమన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చేయండి.

Follow Us