Game Changer: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. వారిపై క్రిమినల్ కేసు పెట్టిన నిర్మాత దిల్ రాజు
ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయరామ తర్వాత కియారా అద్వానీ మరోసారి రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినయ విధేయరామ తర్వాత కియారా అద్వానీ మరోసారి రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు భారీ ఖర్చుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే రామ్‌చరణ్ సినిమాకు లీకులు బెడద తప్పడం లేదు. గతంలోనే గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఏకంగా ఒక ఆడియో సాంగ్ లీక్ అయ్యింది. ‘జరగండి.. జరగండి’ అనే లిరిక్స్‌తో సాగే ఆడియో సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది ఫైనల్ వెర్షన్ కాదని, కేవలం బేసిక్ సాంగ్ అని తెలుస్తోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి సాంగ్ లీక్ కావడంపై నిర్మాత దిల్‌రాజు సీరియస్ అయ్యారు. సాంగ్‌ను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‍లో క్రిమినల్ కేసు వేశారు దిల్‌రాజు. సామాజిక మాధ్యమాల్లో సాంగ్‌ను ఎవరు లీక్ చేశారో మెయిన్ సోర్స్‌ను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు దిల్‍రాజ్. అలాగే ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వాట్సాప్ సహా సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ సాంగ్‌ను షేర్ చేసే ఎవరిపై అయినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.
గేమ్‌ఛేంజర్ సాంగ్ లీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పేపర్లను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ‘ మా మూవీ గేమ్ ఛేంజర్ కంటెంట్‌ను లీక్ చేసిన వారిపై ఐపీసీ 66(సీ) కింద క్రిమినల్ కేసు నమోదు చేశాం. చట్ట విరుద్ధంగా లీక్ అయిన సరైన క్వాలిటీ లేని నాసిరకం కంటెంట్ ను వ్యాప్తి చేయొద్దు’ అని ఈ పోస్టులో కోరింది. సుమారు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్.జే. సూర్య, సముద్రఖని, నాజర్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
నాసిరకం కంటెంట్ ను వ్యాప్తి చేయద్దు ప్లీజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.