Dil Raju: కొత్తింట్లో శ్రీనివాస కల్యాణం.. భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన దిల్ రాజు.. వీడియో వైరల్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు దైవభక్తి ఎక్కువ. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామిని ఆయన బాగా ఆరాధిస్తారు. అందుకే తన ప్రొడక్షన్ బ్యానర్ కు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అని శ్రీనివాసుడి పేరు పెట్టాడు. అలాగే తన సొంతూరిలోనూ వేంకటేశ్వర స్వామి గుడిని నిర్మించారు.

ఓ వైపు నిర్మాతగా తన సినిమా పనులు, మరోవైపు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నిత్యం బిజి బిజీగా ఉంటారు దిల్ రాజు. ఇటీవలే నితిన్ తో కలిసి తమ్ముడు సినిమాను నిర్మించిన ఆయన ప్రస్తుతం బలగం దర్శకుడు వేణు యెల్డండితో కలిసి ఎల్లమ్మ అనే సినిమాను నిర్మించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే దిల్ రాజుకు దైవ భక్తి ఎక్కువ. వేంకటేశ్వర స్వామిని బాగ ఆరాధిస్తారు. వీలు చిక్కినప్పుడుల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారాయన. ఇక సొంతూరిలో తన సొంత డబ్బులతో శ్రీనివాసుని గుడిని సైతం నిర్మించారు దిల్ రాజు. వీలు ఉన్నప్పుడల్లా తన భార్య , కొడుకుతో కలిసి ఆ గుడికి వెళుతుంటాడు. తాజాగా తన కొత్త ఇంట్లో శ్రీవారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు దిల్ రాజు. ఈ సందర్భంగా సతీమణ తేజస్వినితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంప్రదాయం ప్రకారం ఆమెతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తేజస్విని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. దీంతో ఇప్పుడీ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో చనిపోయింది. ఇది జరిగిన మూడేళ్లకు అంటే 2020లో తేజస్వినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022లో అన్వి రెడ్డి అనే కుమారుడు జన్మించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తమ్ముడు సినిమాతో మన ముందుకు వచ్చారు దిల్ రాజు. ఇందులో హీరో నితిన్ గా నటించాడు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అలాగే సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల తర్వాత ఇదే సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. అయతే భారీ అంచనాలతో రిలీజైన తమ్ముడు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం బలగం డైరెక్టర్ వేణు యెల్దండితో కలిసి ఎల్లమ్మ అనే సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఇందులో కూడా నితినే హీరోగా నటించనున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
దిల్ రాజు భార్య తేజస్విని లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








