AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Kokken: ఈ విలన్ భార్య టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా? బిగ్‌ బాస్‌లోనూ సందడి చేసిన ఆ బ్యూటీ ఎవరంటే?

కేరళకు చెందిన జాన్ కొక్కన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2016లో నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు సుమారు 40 కు పైగా సినిమాల్లో నటించిన జాన్ కొక్కెన్ సతీమణి కూడా టాలీవుడ్ డలో ఫేమస్ హీరోయిన్.

John Kokken: ఈ విలన్ భార్య టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా? బిగ్‌ బాస్‌లోనూ సందడి చేసిన ఆ బ్యూటీ ఎవరంటే?
John Kokken Family
Basha Shek
|

Updated on: Aug 21, 2025 | 7:07 PM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్న నటుడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చాలా మందికి అతని పేరు తెలియకపోయినా టాలీవుడ్ ఫేమస్ విలన్ అని ఇట్టే పసిగడతారు. ఎందుకంటే కేరళకు చెందినప్పటికీ అనీష్ జానీ కొక్కెన్ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 40 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు. రవితేజ డానుశీను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన జాన్ తీన్ మార్, అధినాయకుడు, దరువు, ఎవడు, నేనొక్కడినే, బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, రాజా ది గ్రేట్, కేజీఎఫ్ ఛాప్టర్ 1,2, వెంకీ మామ, మహర్షి, తునివు, వీర సింహారెడ్డి, కెప్టెన్ మిల్లర్, మదగజరాజా తదితర సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా అలరించాడు. ఇక కోలీవుడ్ హీరో ఆర్య నటించిన సార్పట్ట సినిమాలో జాన్ కొక్కెన్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే జాన్ కొక్కెన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ నటుడు రెండు సార్లు వివాహం చేసుకున్నాడు. మొదట 2016లో ప్రముఖ నటి మీరా వాసుదేవన్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి బాబు కూడా పుట్టాడు. అయితే అభిప్రాయ భేదాలో వీరు విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన కొన్నేళ్లకు మళ్లీ ఒక టాలీవుడ్ నటితో ప్రేమలో పడ్డాడు జాన్. 2019లో ఆమెతో కలిసి మళ్లీ పీటలెక్కాడు. ఇప్పుడు ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నారు. ఇంతకీ జాన్ రెండోసారి పెళ్లి చేసుకున్న నటి ఎవరో తెలుసా? పూజ రామచంద్రన్. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ స్వామి రారా సినిమాలో కర్లీ హెయిర్ తో నిఖిల్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి క్యూట్ గా కనిపిస్తుంటుంది. అందరినీ మాటల్లో పెట్టి మాయ చేస్తుంటుంది. ఆ అమ్మాయినే జాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పూజాకు కూడా ఇది రెండో వివాహమే. 2010లో ఆమె వీజే క్రెయిగ్‌ను వివాహం చేసుకుంది కానీ 2017 లో అతని నుండి విడాకులు తీసుకుంది.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో జాన్ కొక్కెన్..

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజా. స్నేహితుడు, పిజ్జా, డి కంపెనీ, దోచెయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీ మామా, కృష్ణార్జున యుద్ధం, పవర్ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, రిపీట్, మై నేమ్ ఈజ్ శ్రుతి తదితర తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది.

పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజ కొన్ని రోజుల క్రితం విడుదలైన హత్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..