AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ..

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచలోనే అతి ఎత్తైన భవనంగా దీనికి గుర్తింపు ఉంది. అయితే ఈ విలాసవంతమైన భారీ భవనం ఇప్పుడు నివాసాలకు నిలయంగా మారింది. అందుకే సెలబ్రిటీలు కోట్లు కుమ్మరించి ఇక్కడ అపార్టమెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.

Tollywood: దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ..
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 24, 2025 | 7:15 PM

Share

ప్రపంచంలో అత్యధికులు సందర్శించే ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ కూడా ఒకటి. ముఖ్యంగా ఇక్కడి బుర్జ్ ఖలీఫా భవనమంటే తెలియని వారు ఉండరు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా దుబాయ్ కు వెళితే ఈ బుర్జ్ ఖలీఫాను సందర్శించాల్సిందే. భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఈ ఆకాశ సౌధాన్ని అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. అందుకే పలువురు కోటీశ్వరులు, వ్యాపార వేత్తలు, సినిమా సెలబ్రిటీలు కోట్లు కుమ్మరించి ఇక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో మన దేశానికి చెందిన సినీ ప్రముఖలు కూడా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం మలయాళ సూపర్ స్టార మోహన్ లాల్ ఈ బుర్జ్ ఖలీఫాలో సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దీనిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు మోహన్ లాల్. అయితే ఈ బుర్జ్ ఖలీపాలో మరొక ఇండియన్ సెలబ్రిటీ కూడా ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.

శిల్పా శెట్టి ప్రముఖ వ్యాపార వేత్త రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాజ్ కుంద్రా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్‌ను తన సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. శిల్పాశెట్టి ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. దీని విలువ సుమారు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మోహన్ లాల్, శిల్పా శెట్టితో పాటు పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్‌ బుర్జ్ ఖలీఫా భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్‌ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు ‍అని ముద్దుగా పిలుస్తారట. ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే.. మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలకు కూడా దుబాయిలో అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని ప్రచారంలో ఉంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు.

ఇవి కూడా చదవండి

శిల్పా శెట్టి లేటెస్ట్ ఫొటోస్..

సింగిల్ బెడ్ రూమ్ కొనాలంటే..

బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఈ టవర్‌లో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ ధర కనీసం రూ. 7 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. 2 బెడ్‌రూమ్ యూనిట్ ధర కనీసం రూ. 10.8 కోట్లు ఉంటుంది. ఈ భవనంలో అల్ట్రా-లగ్జరీ అపార్ట్ మెంట్ల ధరలు రూ. 20–22 కోట్లకు పైడా పలుకుతాయని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..