AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచానపడ్డ భర్త.. భార్య చేసిన పనికి ఊరంతా షాక్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ , హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

మంచానపడ్డ భర్త.. భార్య చేసిన పనికి ఊరంతా షాక్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2025 | 7:18 PM

Share

ఓటీటీ పుణ్యమా అని రకరకాల సినిమాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. మరో వైపు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నాయి. ఓటీటీల్లో మెప్పిస్తున్న సినిమాల్లో హారర్, రొమాంటిక్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బోల్డ్ సినిమాలు ఓటీటీలో లెక్కకు మించి ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే తెలుగులోకి డబ్ అయ్యి కూడా మెప్పిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇక ఓటీటీలో ఊపేస్తున్న సినిమాల్లో ఇప్పుడు ఓ రొమాంటిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఓటీటీని ఊపేస్తున్న సినిమాల్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో కేవలం బోల్డ్ సన్నివేశాలే కాదు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లింగ్ సీన్స్ కూడా బోలెడన్ని ఉన్నాయి. మానవ సంబంధాలు, అక్రమ సంబంధాలు వీటిపై ఇప్పటికే ఎన్నో రకాల సినిమాలు వచ్చాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమాలో కట్టుకున్న భర్త మంచాన పడటంతో భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుంది. ఆతర్వాత స్టోరీ ఊహించని ట్విస్ట్ లోకి మారుతుంది. ఇంతకూ ఈ సినిమా పేరేంటి..? ఓటీటీలో ఎక్కడ చూడోచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.!

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

ఈ సినిమా కథ ఓ గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో డోలోరెస్ అనే మహిళ తన భర్తతో కలిసి జీవిస్తుంటుంది. అతను ఓ ప్రమాదంలో గాయపడి పక్షవాతం బారిన పడతాడు. అయితే  డోలోరెస్ చాలా అందంగా ఉంటుంది. ఆమె జీవితం ఓ చిన్న గ్రామంలో తీరని కోరికలతో ఉంటుంది. భర్త మంచాన పడటంతో ఆమె కోరికలు నెరవేరకుండా ఉంటాయి. అయితే అదే సమయంలో ఆమె జైరాన్ అనే వ్యక్తిని కలుస్తుంది. జైరాన్ ఓ బాటసారి. అతను ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండటానికి వస్తాడు. అతను మంచి యవ్వనంలో ఉండటంతో డోలోరెస్ అతనిపై మనసు పడుతుంది. తన కోరికలను అతనితో తీర్చుకుంటుంది. అయితే వీరి వ్యవహారం హద్దులు మీరిపోతుంది. కానీ ఆమె భర్త మాత్రం డోలోరెస్ పై ఎంతో ప్రేమతో విధేయతతో ఉంటాడు. కానీ ఆమె మరో వ్యక్తితో యవ్వారం నడుపుతుంది. క్రమంగా ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. దాంతో ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. చివరకు ఏమైంది.? ఆమె ఎవరిని ఎంచుకుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు లిగావ్. 85 నిమిషాల నిడివి గల ఈ సినిమా వివామాక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి హెడ్సెట్ పెట్టుకొని ఒంటరిగా చూడాల్సిన సినిమా ఇది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..