Godavari: ‘గోదావరి’కి 19 ఏళ్లు.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
అక్కినేని సుమంత్, కమలిని ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గోదావరి’. ‘ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది’.. అనేది ఈ సినిమా క్యాప్షన్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2006 మే 19న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

టాలీవుడ్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయనది అందే వేసిన చేయి. అలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో గోదావరి ఒకటి. అక్కినేని సుమంత్, కమలిని ముఖర్జీ ఇందులో హీరో, హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర, కమల్ కామరాజు, మధుమణి, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2006 మే 19న థియేటర్లలో విడుదలైన గోదావరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గోదావరి అలల్లాగానే ఈ మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక సుమంత్, కమిలిని ముఖర్జీల అభినయం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఇందులోని పాటలు కూడా ఎంతో వినసొంపుగా ఉంటాయి. రాధాకృష్ణన్ ఈ సినిమాకు స్వరాలందించారు. ఈ సినిమాను చూస్తే దాదాపు గోదావరి నదిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ మూవీ లో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే గోదావరి సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు దక్కాయి. కాగా గోదావరి సినిమా విడుదలై నేటికి 19 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ ఫీల్ గుడ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.
స్టార్ హీరోలు మిస్ అయ్యారు..
ముందుగా గోదావరి సినిమా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ లలో ఎవరో ఒకరితో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారట. కానీ ఆ సమయంలో హీరోలు అందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారట. అలాగే అప్పటికే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ వంటి ఫీల్ గుడ్ సినిమాలో నటించిన రవితేజను కూడా ఈ సినిమాలో హీరోగా అనుకున్నారట డైరెక్టర్. కానీ మాస్ మహరాజా కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారట. దీంతో చివరకు గోదావరి సినిమా సుమంత్ దగ్గరకు చేరింట. అతను వెంటనే ఒకే చెప్పడంతో గోదావరి సినిమా పట్టాలెక్కింది.
#19YearsForGodavari#Sekharkamula brand with good sensibilities and emotions. It is considered as modern classic by the critics at that time.#Godavari Audiocd @MadhuraAudio@KMRADHAKRISHNA1 musical@iSumanth #kamalineemukherjee @sekharkammula @madhurasreedhar @kamalkamaraju pic.twitter.com/VB7mmCyv3q
— Moviez And Music Library (@MovzMusicals999) May 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..