AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా చెల్లి ఎంత కష్టపడిందో మీకు తెలియదు.. ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ సుమ

సోషల్ మీడియాలో నిత్యం ఏందో ఒకటి, ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి.. మీకు అర్ధమయ్యే ఉంటుంది. నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

నా చెల్లి ఎంత కష్టపడిందో మీకు తెలియదు.. ట్రోలర్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ సుమ
Suma Kancharla
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 1:34 PM

Share

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ పచ్చళ్ళ పంచాయితీ పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. నెటిజన్స్ దగ్గర నుంచి సోషల్ మీడియా  ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకూ అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి రీల్స్ తో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకొని, తమ పచ్చళ్లను గట్టిగానే ప్రమోట్ చేసుకున్నరు. కాగా తమ కస్టమర్స్ తో బూతులు తిడుతూ మాట్లాడిన ఆడియోలు లీక్ అవ్వడంతో దెబ్బకు బిజినెస్ మూసుకోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడం. ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఈ అక్క చెల్లెళ్ళ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పటికీ ఈ సిస్టర్స్ పై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. పికిల్స్ బాగున్నాయ్.. కానీ ఇంత రేటు ఎందుకు.? అని అడిగిన ఓ కస్టమర్ ను దారుణంగా తిట్టిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. దాంతో నెటిజన్స్ మండిపడ్డారు. అలాగే ఓ అమ్మాయిని కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఆడియో కూడా లీక్ అయ్యింది. దాంతో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

చివరకు  తప్పయింది క్షమించండి అని చెప్పినా కూడా నెటిజన్స్ వదలడం లేదు వదలడం లేదు. ఇటీవల అలేఖ్య చిట్టిపికిల్స్ లో ఒకరైన రమ్య రీల్స్ తో పాపులర్. ఇన్ స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. హాట్ హాట్ గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది రమ్య. ఇప్పుడు ఈ చిన్నది సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. దాంతో కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తమ సిస్టర్ ను ట్రోల్ చేస్తున్న వారి పై పికిల్ సిస్టర్స్ లో ఒకరైన సుమ ఫైర్ అయ్యింది. “ఏంటి మీ చెల్లి స్టేజ్ మీద నిలబడినందుకే అంత హ్యాపీగా ఉందా.? అని మీరు అనుకోవచ్చు.. కానీ తాను ఎంత కష్టపడిందో మీకు తెలియదు. మేము చాలా నార్మల్ పీపుల్.. తాను ఆ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం కష్టపడింది.?  వీడియోలే కదా చేసింది అని మీరు అనోకోవచ్చు.. కానీ ఎన్ని ఆడిషన్స్ ఇచ్చిందో మీకు తెలియదు. అసలు నేను చేయగలనా అని ఆలోచించింది.. ఓ టైం లో డిప్రషన్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిందంటే క్రెడిట్ మొత్తం రమ్యకే అని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.