AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya : హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు.. ఎమోష్నలైన అనసూయ.. ఏం జరిగిందంటే

అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా తన అందం, అభినయంతో యూత్‌లో మంచి క్రేజ్ సొతం చేసుకుంది. నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Anasuya : హనుమంతుడు మా ఇంటికి వచ్చాడు.. ఎమోష్నలైన అనసూయ.. ఏం జరిగిందంటే
Anasuya
Rajeev Rayala
|

Updated on: May 19, 2025 | 12:07 PM

Share

అందాల యాంకరమ్మ అనసూయ టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా టీవీ షోల్లో రాణించిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. జబర్దస్త్ తో ఒక్కాసారిగా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ.. గ్లామర్ పరంగా.. నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటో షూట్స్ తో పాటు తన సినిమా అప్డేట్స్ అలాగే వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అనసూయ ఇటీవల హైదరాబాద్‌లో కొత్త లగ్జరీ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసింది అనసూయ.

ఇది కూడా చదవండి : గోవిందుడు అందరివాడేలేలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు చూస్తే చెక్ అవ్వాల్సిందే..

అనసూయ కొత్త లగ్జరీ ఇంట్లోకి అడుగు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్తతో కలిసి ఎంతో భక్తిశ్రద్దలతో కొత్త ఇంటి గృహప్రవేశం చేసింది. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఆంజనేయస్వామి మా ఇంటికి వచ్చారు అని అనసూయ ఎమోషనల్ అయిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరుపెట్టిన విషయం తెలిసిందే.. కాగా ఈ ఇంటి గృహప్రవేశం సందర్భంగా ఆమె ఇంట్లో హోమం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! ఈ ఫొటోలో స్కూల్ డ్రస్ వేసుకున్న రెండు జెళ్ళ పాప గుర్తుందా.? ఇప్పుడెలా ఉందంటే

కుటుంబంతో కలిసి అనసూయ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అనసూయ ఇంట్లో హోమం నిర్వహించింది. అనసూయ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ఈ ఫొటో తో పాటు దీనికి సంబంధించిన అనుభూతి మీతో పంచుకోవాలనుకుంటున్నా.. ఈ నెల 3న మేము మా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాం.. ఆ ఇంట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకొన్నాం.. మా గురువు గారిని కలిసి ఇంటికి ‘సంజీవని అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పాం. ఆయన కొన్ని సెకన్లు కళ్లు మూసుకుని ‘శ్రీరామ సంజీవని అని పెట్టు’ అన్నారు. ఆతర్వాత మేము మా పనుల్లో ఉండగా మా గురువుగారు హోమ్ మొదలు పెట్టారు. ఆతర్వాత ఓ 20 నిమిషాలకు ఆయన మాదగ్గరకు వచ్చి..హనుమంతుడు వచ్చాడు అంటూ ఫోటో చూపించారు. నా కన్న తండ్రి తర్వాత ఆ హనుమంతుడినే నా తండ్రిగా భావిస్తానని నా ఆప్తులందరికీ తెలుసు అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అనసూయ.

ఇది కూడా చదవండి : సీన్ సీన్‌కు సితారే..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన సినిమా మావ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్