శ్రుతిహాసన్ అక్క టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్.. 200లకు పైగా సినిమాలు చేసింది.. ఆమె ఎవరంటే
అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శ్రుతిహాసన్ కెరీర్ బిగినింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తూ రాణిస్తుంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే కెరీర్ బిగినింగ్ లో వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి ఓ సినిమా చేసిందో ఈ ముద్దుగుమ్మ జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మధ్యలో లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.
శ్రుతిహాసన్ రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ మూవీతో హిట్స్ అందుకుంది. అలాగే రీసెంట్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలోనూ శ్రుతిహాసన్ నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయిన శృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ అక్క కూడా టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ అని మీకు తెలుసా.? ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
ఆమె ఎవరో కాదు..సుహాసిని. సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుహాసిని. తన నటీనతో హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుహాసిని. తెలుగులో సుహాసిని 50కి పైగా సినిమాలు చేశారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికి కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు. అయితే శృతి హాసన్ , సుహాసిని అక్క చెల్లెళ్లు అవుతారు. సుహాసిని తండ్రి, కమల్ సొంత అన్నా తమ్ముళ్లు. దాంతో శ్రుతి, సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




