ఇది కదా ట్విస్ట్ అంటే.. మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరో కూడా.? సోషల్ మీడియా పోస్ట్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. యాక్షన్ అడ్వాంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశారు. ప్రియాంక చోప్రా, మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు హాలీవుడ్ స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేస్తున్నారు జక్కన్న. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను ఈ నెల 15న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ పేరుతో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
కాగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఓ సాంగ్ తో పాటు ప్రియాంక చోప్రా లుక్ ను కూడా విడుదల చేశారు. చీరకట్టులో ప్రియాంక చోప్రా లుక్ అదిరిపోయింది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా లుక్ పై ఓ స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ మాధవన్. ఈ స్టార్ హీరో తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రియాంకా చోప్రా లుక్ పై మాధవన్ రియాక్ట్ అవుతూ.. “వావ్వావ్వావ్వావ్వావ్ ఆండీ బ్రిలియంట్.. వాట్ ఎ లుక్ , ఇంపాక్ట్ రోజురోజుకు మీరు నమ్మలేని విధంగా మారిపోతున్నారు” అని కామెంట్ చేశారు.
అలాగే గతంలో విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ పై కూడా మాధవన్ రియాక్ర్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ పై మాధవన్ స్పందిస్తూ.. ఈ లుక్ చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ఈ ప్రపంచం మిమ్మల్ని ఈ అద్భుతమైన పాత్రలో చూసే వరకు నేను వేచి ఉండలేకపోతున్నాను” అంటూ రాసుకొచ్చారు. దాంతో ఇప్పుడు మాధవన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ మాధవన్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాధవన్ వరుసగా మహేష్ , రాజమౌళి సినిమా అప్డేట్స్ పై రియాక్ట్ అవుతుండటంతో ఆయన ఈ సినిమాలో ఖచ్చితంగా నటిస్తున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




