AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే

ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత. తెలుగులో ఈ అమ్మడు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది అంజలా జవేరి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే
Anjala Zaveri
Rajeev Rayala
|

Updated on: Jul 15, 2024 | 1:47 PM

Share

ఒకప్పుడు తన అందంతో కుర్రకారును కట్టిపడేసిన భామ అంజలా జవేరి. ఈ అమ్మడు తన క్యూట్ నెస్ తో కుర్రకారు గుండెల్లో బాణాలు దింపింది. ప్రేమించుకుందాం రా.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అప్పటిలో ఈ అమ్మడు యూత్ ఆరాధ్య దేవత. తెలుగులో ఈ అమ్మడు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అప్పటి జనరేషన్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది అంజలా జవేరి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఇలా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా.. దేవి పుత్రుడు,  నాగార్జునతో చందమామ రావే, చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో నరసింహనాయుడు.. భలేవాడివి బాసు లాంటి సినిమాలు చేసింది.

ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత ప్రేమ సందడి, ఆప్తుడు సినిమాలు చేసింది. ఆలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. అలాగే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోను మెరిసింది. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యింది అంజలా జవేరి. అయితే ఈ అమ్మడు ఇప్పటికి కూడా తరగని అందంతో కవ్విస్తుంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అయితే ఆమె భర్త గురించి చాలా మందికి తెలియక పోవచ్చు.

అతను టాలీవుడ్ నటుడే.. అంజలా జవేరి భర్త పేరు తరుణ్ అరోరా.. ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాలో విలన్ గా చేశాడు. జయ జానకీ నాయకా, కాటమ రాయుడు, అమర్ అక్బర్ ఆంటోనీ, అర్జున్ సురవరం, తదితర చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు తరుణ్ అరోరా. తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ స్టైలిష్ విలన్. అంజలా జవేరి, తరుణ్ అరోరాకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి భర్తను చూసి అవాక్ అవుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
శక్తివంతమైన కర్మ దశలోకి ప్రపంచం..? 2026 రెండో అర్ధభాగం ఎలా...
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఐర్లాండ్‌ వెనకున్న శక్తి ఎవరు? టీమిండియానే ఓడించేంత బలం ఎక్కడిది?
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే రోజంతా ఎనర్జీగా ఉంటారు
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..
ఉదయ్ కిరణ్ చనిపోయాక ఆ హీరో మా ఇంటికి వచ్చి ఏం చెప్పాడంటే..