Anand Movie: ‘ఆనంద్’.. మంచి కాఫీ లాంటి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ సినిమాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా ఈ మూవీ ట్యాగ్ లైన్. దీనికి తగ్గట్టుగానే ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఆనందం సినిమా సాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కమలినీ ముఖర్జీ నటన హైలెట్ అని చెప్పుకోవాలి.

టాలీవుడ్ లో ఉన్న మంచి ఫీల్ గుడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన సినిమాల్లో హీరోలకు ఎంతో ప్రాధాన్యముంటుందో హీరోయిన్లకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేకాదు కథానాయికలను ఎంతో అందంగా చూపిస్తారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఆనంద్, గోదావరి, ఫిదా చిత్రాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ సినిమాల్లో హీరోల కంటే హీరోయిన్ల పాత్రలు బాగా ఎలివేట్ అయ్యాయి. కాగా కెరీర్ ప్రారంభంలో శేఖర్ కమ్ములకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఆనంద్. రాజా హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. అలాగే అనీష్ కురువిల్లా, సత్యకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తన అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్ములనే స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. 2004 అక్టోబర్ 15న విడుదలైన ఆనంద్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఫీల్ గుడ్ మూవీగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో భాగమైన అందరికీ మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ నటన నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎంత కష్టమొచ్చినా సెల్ప్ రెస్పెక్ట్ ను వదులుకోని రూప అనే అమ్మాయి పాత్రలో కమలినీ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని మూవీ ఛాన్సులు వచ్చాయి.
అయితే ఆనంద్ సినిమాలో హీరోయిన్ గా కమలినీ ముఖర్జీ మొదటి ఛాయిస్ కాదట. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథ కోసం ముందుగా సదాను సంప్రదించారట. జయం సినిమా సక్సెస్ తో ఫుల్ జోషల్ ఉన్న ఆమెకు ఆనంద్ సినిమా కథ వినిపించారట. అయితే అప్పటికే ఆమె చేతిలో చాలా సినిమాలు ఉండడం, దీనికి తోడు శేఖర్ కమ్ముల అప్పటికీ ఇంకా కొత్త డైరెక్టర్ కావడంతో ఆనంద్ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో శేఖర్ కమ్ముల కమలినీ ముఖర్జీని సంప్రదించారట. కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒకే చెప్పిందట. అలా ఆనంద్.. ఒక మంచి కాఫీ లాంటి సినిమా మన ముందుకు వచ్చింది.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో బిజి బిజీగా..
View this post on Instagram
కాగా సదా సినిమా కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా నే ఉన్నాయి. అలాగే వివిధ కారణాలతో మిస్ చేసుకున్న మూవీస్ కూడా ఉన్నాయి. అందులో ఆనంద్ కాగా మరొకటి చంద్రముఖి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ కోసం ముందుగానే ఆమెనే సంప్రదించారట. అయితే అప్పటికే అపరిచితుడు మూవీలో బిజీగా ఉండడంతో ఈ అవకాశం వదులుకుందట.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




