Tollywood: ఐబీఎమ్‌లో జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది కెరీర్ ప్రారంభంలో రకరకాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ ముద్దుగుమ్మ కూడా ఈ కోవకే చెందుతుంది. ఈ బ్యూటీ తన కెరీర్ ప్రారంభంలో ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎమ్ లో వర్క్ చేసింది.

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ స్పెషాలిటీ ఏంటంటే స్కిన్ షోకు చాలా దూరంగా ఉంటుంది. ఎక్కువగా హోహ్లీ పాత్రలే చేస్తోంది. అందుకే టాలీవుడ్ లో ఈ బ్యూటీకి పక్కింటమ్మాయి అనే ట్యాగ్ ఉంది. వరుణ్ తేజ్, విక్రమ్, విశాల్, సుధీర్ బాబు వంటి హీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈ అందాల తార ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. అయితేనేం సోషల్ మీడియా ఫొటోలతో తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి.
చాలామంది హీరోయిన్ల లాగే ఈ ముద్దుగుమ్మ కూడా చదువులో బాగా చురుకు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకుంది . ఆ వెంటనే బెంగళూరులోని ఐబీఎమ్ లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా జాబ్ లో జాయిన్ అయ్యింది. అయితే ఉద్యోగం చేస్తూనే టిక్ టాక్, వీడియోలు చేస్తూ నెట్టింట మస్త్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ హీరోయిన్ మృణాళిని రవి.
మృణాళిని రవి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
2019లో సూపర్ డీలక్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మృణాళిని రవి గద్దల కొండ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఛాంపియన్, ఎనిమీ, కోబ్రా, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర, రోమియో సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మస్త్ ఫాలోయింగ్ ఉంది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు.
గ్లామరస్ లుక్ లో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








