AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అబ్బాయి కాదు.. అమ్మాయే.. నెట్టింట అందాలతో గత్తరలేపుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే ఫేమస్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ పాన్ ఇండియా లెవల్లో చేసిన ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ క్యూ కట్టాయి. హిందీలో ఎక్కువగా చిత్రాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Tollywood : అబ్బాయి కాదు.. అమ్మాయే.. నెట్టింట అందాలతో గత్తరలేపుతున్న వయ్యారి.. ఒక్క సినిమాతోనే ఫేమస్..
Tripti Dimri
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2025 | 5:48 PM

Share

పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న అబ్బాయి.. ఇప్పుడు పాన్ ఇండియా మోస్ట్ క్రేజీ హీరోయిన్. ఒక్క సినిమాతోనే కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అంతేకాదు.. యూత్ గుండెల్లో ఈ అమ్మడు ఆరాధ్య దేవత. నటనపై ఆసక్తితో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టింది. కెరీర్ తొలినాళ్లల్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారింది. అయితే ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. కట్ చేస్తే..బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాలో హీరోహీరోయిన్స్ కంటే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? చిన్నప్పుడు క్యూట్ గా కనిపిస్తున్న ఈ వయ్యారి.. ఇప్పుడు నెట్టింట అందాలతో గత్తరలేపుతుంది. ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ.

యావత్ పాన్ ఇండియా మూవీ లవర్స్ కు పరిచయం అవసరంలేని పేరు త్రిప్తి డిమ్రీ. 1995 ఫిబ్రవరి 23న జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. హిందీలో శ్రేయాస్ తల్పాడే దర్శకత్వం వహించిన పోస్టర్ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సన్నీ డియోల్, బాబీ డియోల్, తల్పాడే ప్రధాన పాత్రలు పోషించగా.. ఈ మూవీతో త్రిప్తికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 2018లో లైలా మజ్ను, బుల్బుల్, ఖలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో త్రిప్తి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది త్రిప్తి. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత విక్కీ విద్యా కా వహ్ వాలా చిత్రంలోనూ కనిపించింది. అలాగే హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది త్రిప్తి. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..