Bobby Simha: ఈ టాలీవుడ్ నటుడి చెల్లెలు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఏయే సినిమాల్లో నటించిందంటే?
తెలుగోడిగానే పుట్టినా తమిళ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ సింహా. హీరోగా, విలన్ గా, సహాయక నటుడి పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే ఈ మధ్యన తెలుగు సినిమాల్లోనూ ఎక్కువగా కనిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక్కడే వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా మారిపోయాడు.

2023లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా వాల్తేరు వీరయ్య తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ సింహా. అందులో అతను పోషించిన సోల్మన్ సీజర్ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు బాబీ సింహా. భారవగా టెర్రఫిక్ రోల్ పోషించాడు. ఇవే కాదు.. సైజ్ జీరో, రన్, డిస్కో రాజా, గల్లీ రౌడీ, అమ్ము, రజాకార్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. వీటితో పాటు 777 చార్లీ, భారతీయుడు 2 తదితర డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయాడు. సికింద్రాబాద్‌లో పుట్టి పెరిగిన బాబీ సింహా కొంత కాలానికి కుటుంబంతో కలిసి కొడై కెనాల్ వెళ్లిపోయారు. అక్కడే చదువుకున్నాడు. చదువుకుంటున్నప్పుడే నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. అదే సమయంలో కుటుంబ పోషణ కోసం మార్కెటింగ్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో పని చేశాడు. 2007లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాబీ సింహా. తన నటనతో అందరి మన్ననలు అందుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళ భాషా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు.
కాగా బాబీ సింహా చెల్లెలు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. అతని చెల్లెలు పేరు రేష్మ పసుపులేటి. అయితే బాబీ సింహా లాగే తెలుగు సినిమాలకంటే తమిళంలోనే ఈ బ్యూటీకి ఎక్కువ క్రేజ్ , పాపులారిటీ ఉంది. రేష్మ తెలుగులో ఆనంద్ దేవరకొండతో కలిసి హైవే అనే సినిమాలో నటించింది.
రేష్మ పసుపులేటి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
రేష్మ పసుపులేటి యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ్ టీవీ షోస్, ప్రోగ్రామ్స చేసింది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అంతేకాదుతమిళ బిగ్ బాస్ మూడో సీజన్ లో కూడా పాల్గొంది. సోషల్ మీడియా లో యాక్టివ్ గ ఉండే రేష్మ కి ఇన్ స్టా గ్రామ్ లో దాదాపు 1.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తన యూట్యూబ్ ఛానల్ కి 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.