AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుసగా సినిమాలు చేసింది అన్ని యావరేజ్.. కానీ ఇప్పుడు ఒక ఒక్క హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది..

ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టేసి భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. క్రేజ్ ను బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు చాలా మంది అందాల భామలు. కాగా పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు.

వరుసగా సినిమాలు చేసింది అన్ని యావరేజ్.. కానీ ఇప్పుడు ఒక ఒక్క హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది..
Actress
Rajeev Rayala
| Edited By: |

Updated on: Oct 12, 2024 | 9:16 PM

Share

చాలా మంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తున్నపటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. కానీ ఆఫర్స్ మాత్రం అందుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం అంటే అంత సులభం కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో హిట్స్ కొట్టేసి భారీగా రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. క్రేజ్ ను బట్టి ప్రైజ్ డిసైడ్ చేస్తున్నారు చాలా మంది అందాల భామలు. కాగా పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లో ఆ అమ్మడు ఒకరు. చిన్నవయసులోనే కోట్ల రూపాయిలను సంపాదించింది. ఆ అమ్మడు వయసు 27 కానీ.. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు కూడబెట్టింది. చాలా  కాలంగా హిట్స్ లేక సతమతం ఆయిన ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా భారీ హిట్ అందుకుంది. ఒకే ఒక్క సినిమాతో ఏకంగా ఇండస్ట్రీని షేక్ చేసింది.  ఇంతకుఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో పెద్దతిగా బుట్టబొమ్మలా ఉన్న చిన్నారి. ఇప్పుడు హాట్ బ్యూటీగా దుమ్మురేపుతోంది. వరుసగా సినిమాలు చేస్తుంది రీసెంట్ గా భారీ హిట్ అందుకుంది. ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ కపూర్. బాలీవుడ్ ముద్దగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిందీలో రాణిస్తుంది.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లొనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో జాన్వీ అందాలకు యమా క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. కాగా జాన్వీ వయసు ఇప్పుడు 27 ఏళ్ళు కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా సంపాదిస్తూ కోట్లు కూడబెట్టింది. ఇటీవలే ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. అలాగే ఈ అమ్మడి దగ్గర కాస్ట్లీ కార్లు ఉన్నాయి. కోట్ల ఆస్తి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈ బ్యూటీ. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించింది. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవర పార్ట్ 2లో నటిస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన కూడా నటిస్తుంది జాన్వీ కపూర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us