
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీష్ షేక్ చేశారు. ఆ తర్వాత కబీర్ సింగ్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఇక ఇటీవలే యానిమల్ మూవీతో మరోసారి థియేటర్లలో సత్తా చాటారు. బీటౌన్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కలెక్షన్స్ విషయంలో దుమ్మురేపింది. ఈ సినిమాపై ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ.. అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రణబీర్, రష్మికతోపాటు త్రిప్తి డిమ్రీ, అనీల్ కపూర్, బాబీ డియోల్ సైతం కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి. అంతకు ముందు హిందీలో పలు సినిమాలు చేసినా రానీ క్రేజ్.. యానిమల్ సినిమాలో పోషించిన చిన్నపాత్రతో ఫేమస్ అయిపోయింది.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
యానిమల్ సినిమాతో త్రిప్తి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రణబీర్, త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. త్రిప్తి పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో త్రిప్తి నటించగా.. ఆ పాత్రకు ముందుగా అనుకున్న హీరోయిన్ మాత్రం వేరే అంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో జోయా పాత్రకు ముందుగా సారా అలీ ఖాన్ ఆడిషన్ చేసిందట. కానీ ఈ సినిమాలో సారాకు ఛాన్స్ రాలేదని.. చివరకు ఆ పాత్రలో త్రిప్తి డిమ్రి నటించిందట.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
అయితే జోయా పాత్రకు సారా అలీ ఖాన్ అడిషన్ చేయలేదట. సారా గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమని టాక్. దీనిపై ఇప్పటివరకు సారా స్పందించలేదు. ఈ సినిమాలో త్రిప్తి పాత్రపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఒక్క సీన్ తో తెగ ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..