SSMB 29: రాజమౌళి ఆఫర్‌కు నో చెప్పిన బాలీవుడ్ స్టార్.. రూ. 20 కోట్లు ఇస్తామన్న ఒప్పుకోలేదట
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు చివరిగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

అపజయం ఎరగని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాహుబలి, ట్రిపులార్ వంటి అద్భుతాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు రాజమౌళి. ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో ప్రకటించారు. ఇలా ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాను జెట్ స్పీడ్ తో షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
మహేష్ బాబు రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రియాంకా షూటింగ్ లోనూ జాయిన్ అయ్యింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వినిపించాయి.. కానీ దీని పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆఫర్ ను ఓ బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశాడని టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి
రాజమౌళి-మహేశ్ సినిమా ఆఫర్‌ని బాలీవుడ్ నటుడు రిజెక్ట్ చేశారట.. ఆ నటుడు ఎవరో కాదు వర్సటైల్ యాక్టర్ నానా పటేకర్. అయితే పూణే వెళ్లి మరీ రాజమౌళి నానా పటేకర్‌కు కథను వివరించారట. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారట. అయితే కథ బాగున్నప్పటికీ ఆ పాత్రకు తాను న్యాయం చేయలేను అని సున్నితంగా రాజమౌళికి నో చెప్పారట నానా పటేకర్. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా కూడా నానా పటేకర్ ఒప్పుకోలేదని తెలుస్తుంది. రూ. 20కోట్లవరకు రాజమౌళి ఆఫర్ చేశారని తెలుస్తుంది. అయినా కూడా ఆపాత్రకు న్యాయం చేయలేనని చెప్పారట నానా పటేకర్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియదు కానీ బాలీవుడ్ లో ఇదే టాపిక్ వైరల్ అవుతుంది. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








