AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమాలో అస్సలు నటించను.. రూ.12కోట్లు ఇస్తానన్నా నో చూపిన త్రిష.. అసలు కారణం ఇదేనా

నాలుగు పదుల వయసులోనూ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది త్రిష కృష్ణన్. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు.. అటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

ఆ సినిమాలో అస్సలు నటించను.. రూ.12కోట్లు ఇస్తానన్నా నో చూపిన త్రిష.. అసలు కారణం ఇదేనా
Trisha Krishnan
Rajeev Rayala
|

Updated on: May 16, 2026 | 6:55 PM

Share

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు నటి త్రిష. నాలుగు పదుల వయసులో కుర్ర హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తున్నారు త్రిష. రీసెంట్ గా కరుప్పు సినిమాతో హిట్ అందుకున్నారు త్రిష. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే త్రిషకు ఓ భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాదు ఆ సినిమా కోసం ఏకంగా 12కోట్లు కూడా ఆఫర్ చేశారట. కానీ త్రిష మాత్రం ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. పైగా ఆ సినిమాలో ఇద్దరు బడా హీరోలు.

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

ఇంతకూ త్రిష ఎందుకు ఆ సినిమాను రిజెక్ట్ చేసింది. అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి సినిమా చేస్తున్న విషయం  తెలిసిందే.. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి గ్లింప్స్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

అయితే ఆ ఆఫర్ కు త్రిష నో చెప్పారని తెలుస్తుంది. అంతే కాదు సినిమాకోసం ఏకంగా రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.. అయినా కూడా త్రిష ఈ సినిమాను చేయడానికి అంగీకరించలేదని తెలుస్తుంది. ఈ భారీ ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్‌ నిర్మాణసంస్థ తెరకెక్కించడంతో త్రిష ఈ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని ఇంగ్లీష్ మీడియా తెలిపింది.. అయితే త్రిష నో చెప్పడానికి అసలు రీజన్ ఇదేనా అని అభిమానుల్లో డౌట్స్ మొదలయ్యాయి. కాగా విజయ్ ఇటీవలే తమిళనాడు సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ ఎన్నికల్లో త్రిష పేరు కాస్త గట్టిగా వినిపించిన విషయం తెలిసిందే..

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు<

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us