స్టార్ హీరో సరసన మలయాళీ ముద్దుగుమ్మ !
కన్నుగీటి ఒక్కసారిగా నేషన్ వైడ్ పాపులర్ అయిపోయింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రంలో ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

కన్నుగీటి ఒక్కసారిగా నేషన్ వైడ్ పాపులర్ అయిపోయింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రంలో ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ అంతగా అలరించలేకపోవడంతో..ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. త్వరలోనే అమ్మడు ఓ స్టార్ హీరో తనయుడితో జత కట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కథానాయకుడిగా మురుగదాస్ శిష్యుడు రవికాంత్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. అందులో ప్రియాప్రకాశ్ వారియర్‌ను ఎంపిక చేశారని టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా ప్రియా.. తెలుగులో కూడా నితిన్, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం.
Also Read :
ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ !